ధోనీ కోసం ఆ అభిమాని ఏకంగా..?!

క్రికెట్ అంటే భారతదేశంలో చాలామందికి ఇష్టం.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉండే పాపులర్ గేమ్ లో క్రికెట్ కూడా ఉంది.

 That Fan Is United For Dhoni  Ms Dhoni, Fan, 16 Days, 1400 Km , Walked, Viral La-TeluguStop.com

మరి ఇటువంటి క్రికెట్ టీమ్ లో స్థానం సంపాధదించడంలో చాలా కష్టపడాలి.ప్రాక్టీస్ చేసి తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ రావాలి.

అటువంటి క్రికెట్ లో ఎంఎస్ ధోనీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు.ఇండియా క్రికెట్ చరిత్రలో మోస్ట్ కూల్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది ధోనినే అని చెప్పుకోవచ్చు.

ధోనీ క్రికెట్ కు గుడ్ బై చెప్పి సంవత్సరం అవుతోంది.ప్రస్తుతం ధోనీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.

కెరీర్ పరంగా ఆయన క్రికెట్ కు రైటర్మెంట్ ప్రకటించినప్పటికీ అభిమానులకు మాత్రం టచ్ లోనే ఉన్నాడు.దేశవ్యాప్తంగా ధోనీకి విపరీతమైన క్రేజ్ ఉంది.

ఇక తమిళనాడులో అయితే సినిమా హీరోలకు కూడా అంత క్రేజ్ ఉండదు.జార్కండ్ కు సంబంధించిన ధోనిని చెన్నై ప్రజలు విపరీతంగా అభిమానిస్తారు.

అలాంటి అభిమానం ఉన్న ఓ యువకుడు ధోనీని కలిసేందుకు సన్నద్దమయ్యాడు.లాక్ డౌన్ లో ధోనిని కలిసేందుకు అనేక ఇబ్బందులు ఎదురుపడ్డాయి.దీంతో ఎలాగైనా సరే ధోనీని కలిసేందుకు నడిచి వెళ్లడం ప్రారంభించాడు.హర్యాణా లోని హిసార్ జిల్లా జలన్ ఖేడా ఊరుకు చెందిన యువకుడు ధోనిని కలిసేందుకు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.18 ఏళ్ల అజయ్ తన ప్రయాణాన్ని జులై 29వ తేదిన మొదలుపెట్టి 16 రోజుల పాటు నిరంతరంగా నడిచాడు.ఇలా దాదాపుగా 1400 కి.మీ.నడిచి చివరికి అగస్టు 15వ తేదీన రాంచీలోని ధోనీ హౌస్ కు వెళ్లాడు.

Telugu Km, Days, Msdhoni, Meida, Ups, Latest, Walked-Latest News - Telugu

దారి మధ్యలో ఒక బార్బర్ అజయ్ తో మాట్లాడితే ధోని గురించి వెళ్తున్నానని చెప్పాడు.దీంతో ఆ బార్బర్ ధోనీ పేరుతో ఉండేలా స్పెషల్ హెయిర్ కటింగ్ చేశాడు.అయితే ఎట్టకేలకు ధోనీ ఇంటికి చేరిన ఆ వ్యక్తికి నిరాశే ఎదురైంది.ఐపీఎల్ ఫేజ్ – 2 కోసం ఎంఎస్ ధోనీ యూఏఈ వెళ్లడంతో ఇంట్లో లేడు.

దీంతో ఆ అభిమానికి నిరాశే కలిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube