ఆ ఫ్యామిలీ ఫ్యూచ‌ర్‌పై జ‌గ‌న్ డెసిష‌న్ ఏంటి..!

ఏపీలో పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు కీల‌క జిల్లాల్లో తూర్పు గోదావ‌రి జిల్లా ఒక‌టి.ఈ జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాల‌తో పాటు 3 ఎంపీ సీట్లు ఉన్నాయి.

 That Family Future In The Hands Of Jagan ..!-TeluguStop.com

ఇక్క‌డ మెజార్టీ సీట్లు గెలుచుకున్న పార్టీయే ఏపీలో అధికారంలోకి రావ‌డం ఆన‌వాయితీగా ఉంటూ వ‌స్తోంది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పాగా వేసేందుకు అధికార టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీ హోరాహోరీగా ఫైట్ చేస్తున్నాయి.

ఈ జిల్లాలో మాజీ మంత్రి జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఇప్పుడు జ‌గ‌న్ చేతుల్లో ఉంది.వీరి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడు ? వీరికి ఏ నియోజ‌క‌వ‌ర్గం కేటాయిస్తాడు ? అన్న‌ది ఇప్పుడు తూర్పు పాలిటిక్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం జక్కంపూడి రామ్మోహన రావు రాజకీయ వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు జక్కంపూడి రాజా ఇంద్ర వందిత్ రాజా నగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.రామ్మోహ‌న్ అనారోగ్యానికి గుర‌య్యాక ఆయ‌న వార‌సురాలిగా ఆయ‌న భార్య విజ‌య‌ల‌క్ష్మి 2009లో రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఆమె వైసీపీ నుంచి రాజాన‌గ‌రంకు మారి అక్క‌డ కూడా ఓడిపోయారు.ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేయ‌డం లేద‌ని తెలుస్తోంది.

ఈ ఫ్యామిలీ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ విష‌యంలో జ‌గ‌న్ ఇంట‌ర్న‌ల్‌గా ఓ డెసిష‌న్‌కు వ‌చ్చిన‌ట్టే తెలుస్తోంది.వైసీపీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా కూడా వున్న విజయలక్ష్మికి పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవిని ఇస్తామనే హామీతో ఆమె కుమారుడు రాజాకు ఈ సారి రాజాన‌గ‌రం సీటు ఇచ్చేలా జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే జ‌క్కంపూడి ఫ్యామిలీ రాజాన‌గ‌రం కంటే రాజ‌మండ్రి రూర‌ల్ సీటు కావాల‌ని ప‌ట్టుబ‌డుతోన్న‌ట్టు స‌మాచారం.రాజా వైసీపీ పెట్టిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్‌కు అండ‌గా ఉంటున్నారు.

ఆయన పార్టీ రాష్ట్ర యువ‌జ‌న విభాగానికి అధ్య‌క్షుడిగా ఉంటున్నారు.ఈ క్ర‌మంలోనే రాజాను వ‌చ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దించేందుకు జ‌గ‌న్ ప్లాన్‌లో ఉన్నార‌ని స‌మాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube