పగలు 'పవన్'... రాత్రి 'బాబు' ... ఎవరా 'ఎర్ర' కృష్ణుడు ..?  

  • ఏపీలో కోవర్ట్ రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఒక పార్టీకి దగ్గరగా ఉంటూ… మరో పార్టీ వారికి సమాచారం చేరవేస్తూ … రాజకీయ లబ్ది పొందే నాయకులకు ప్రస్తుత పరిస్థితుల్లో … ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇటువంటి నాయకులను చేరదీయడంలో ఏపీ సీఎం చంద్రబాబు ని మించిన నాయకుడు మరొకడు ఉండదనే చెప్పాలి. అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ దెబ్బ తినడానికి కారణం ఈ కోవర్ట్ ఆపరేషన్ లే. ఇప్పడు పవన్ జనసేన పార్టీ పెట్టాడు. రాజకీయంగా ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ కమ్యూనిస్ట్ నాయకుడు కోవర్ట్ గా పనిచేస్తూ పవన్ కి నిత్యం టచ్ లో ఉంటూ అక్కడి విషయాలు బాబు కి చేరవేస్తున్నట్టు తెలుస్తోంది.

  • That Communist Leader Playing Double Game To The Pawan Kalyan-

    That Communist Leader Playing Double Game To The Pawan Kalyan

  • కలిసి ఉద్యమం చేద్దామని జనసేనను పురమాయించడం, అందుకు జనసేన ఫాలో అయ్యే వ్యూహాన్ని వెంటనే చంద్రబాబుకు చేరవేయడం వంటివి సదరు కమ్యూనిస్టు నేత చేస్తున్నట్టు జనసేనాని పక్కా సమాచారంతోనే ఒక నిర్దారణకు వచ్చారు. ఇంతలోనే సదరు కోవర్టు కమ్యూనిస్టుకు చెందిన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌- టీడీపీ కూటమితో పొత్తు కుదుర్చుకోవడంతో పవన్‌ కల్యాణ్‌ కంగుతిన్నారని చెబుతున్నారు. ఏపీలో చంద్రబాబులాంటి దుర్మార్గుడు లేడని తన వద్ద చెప్పే సదరు కమ్యూనిస్టు పార్టీ మరి తెలంగాణలో ఎలా చేతులు కలిపిందని పవన్‌ షాక్‌కు గురి అయ్యారని చెబుతున్నారు.

  • That Communist Leader Playing Double Game To The Pawan Kalyan-
  • మీడియా ముందు పవన్‌ కల్యాణ్‌పై ఈగ వాలినా తాము సహించం అన్నట్టు మాట్లాడే ఆ కమ్యూనిస్టు నేత లోలోన మాత్రం చంద్రబాబుకు సమాచారం చేరవేస్తున్నారని పవన్‌ కల్యాణ్‌కు ఇటీవల పక్కా సమాచారం అందినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పగలు పవన్‌ వద్ద తిరిగే సదరు కమ్యూనిస్టు నాయకుడు రాత్రికి చంద్రబాబుకు టచ్‌లోకి వెళ్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లోని కొందరు పవన్‌ సానుభూతిపరులు జనసేనానికి విషయం చేరవేశారు. దీంతో అప్రమత్తం అయిన పవన్ ఇప్పుడిపుడే ఆయన్ను దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమం నీరు గారిపోవడం వెనుక సదరు కమ్యూనిస్టు నేతే కీలక పాత్ర పోషించారని చాలా కాలంగా ఆరోపణ ఉంది. ఈ విషయాన్ని కూడా ఇటీవల పవన్‌ కల్యాణ్ దృష్టికి రావడంతో ఆయన ఆలోచనలో పడ్డారు.