427 గ్రామాల‌కు ఆ బుడ్డోడే జ‌మిందార్ అంట‌.. విష‌యం తెలిస్తే..

పురాత‌న కాలంలో చాలా ఊర్ల‌ళ్లో మ‌న‌కు పెద్ద రాయుడు లాంటి వారు కనిపిస్తుండేవారు.ఊర్లో ఏది జ‌రగాల‌న్నా స‌రే వారు నిర్ణ‌యం తీసుకోవాల్సిందే.

 That Child Zamindar Means 427 Villages If You Know The Thing, Child Zamindar, Vi-TeluguStop.com

ఇక వారు చెప్పిందే వేదంలా ఆ ఊరు జ‌నాలు భావించేవారు.ఆ విధంగా ఇప్ప‌టికీ చాలా పురాత‌న ఊర్లు అయిన అట‌వీ గ్రామాల్లో ఇప్ప‌టికీ ఈ జ‌మిందారీ విధాన‌మే న‌డుస్తోంది.

ఏకంగా చాలా ఊర్ల‌కు పెద్ద‌గా ఒక జ‌మిందారి ఉంటాడు.ఆయ‌న చెప్పిందే ఆ ఊరు వారంతా న‌డుచుకుంటూ ఉంటారు.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వైర‌ల్ న్యూస్ ఒక‌టి నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

మ‌న ప‌క్క‌నే ఉండే తమిళనాడు రాష్ట్రంలో ఓ పిల్ల జమిందార్ త‌యారవ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

అస‌లు విష‌యం ఏంటంటే ఆ బుడ్డోడి వయస్సు కూడా తొమ్మిది సంవత్సరాలు.అయితే ఇంత చిన్న వ‌య‌స్సులోనే అత‌డు ఏకంగా 427 గ్రామాలకు పెద్దగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.ఎందుకంటే ఈ గ్రామాల‌న్నింటికీ ఇప్ప‌టి వ‌ర‌కు 87 సంవత్సరాలు వయసున్న చిన్నండి జ‌మిందారిగా ఉండేవాడు.అయితే గతేడాది ఆయ‌న అనారోగ్యంతో మ‌ర‌ణించాడు.

దీంతో మ‌ళ్లీ ఆయ‌న వార‌సుల‌నే ఎంపిక చేసేందుకు ఇన్ని రోజులు అంతా వెయిట్ చేశారు.

Telugu Child Zamindar, Child, Shaktivel, Tamilnadu, Zamindar-Latest News - Telug

ఇక ఇందుకోసం ఏంక‌గా 36 గ్రామాల పెద్ద‌లు సమావేశమై చి్నండి మనవడు అయిన శక్తివేల్‌ను జ‌మిందాక‌రిగా ఎన్న‌కున్నారు.ఇక ఈ పెద్ద‌ల నిర్ణయాన్ని కూడా మిగిలిన అన్ని గ్రామాల ప్రజలు స్వాగతించ‌డం విశేషం.ఇక్కడ మ‌రో విష‌యం ఏంటంటే చిన్నండికి ఇప్ప‌టికే ఇద్దరు కొడుకుల‌తో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నా కూడా కేవ‌లం చిన్నండి అంశ‌తో ఉన్నాడ‌నే కార‌ణంతో రెండో కొడుకుకు పుట్టిన మ‌నువ‌డినే జ‌మిందారిగా ఎన్నుకున్నారు.

దీంతో ఇప్పుడు ఆ చిన్నారి చెప్పిందే అన్ని ఊర్ల‌ళ్లో వారు పాటించాలి.విన‌డానికి చాలా గ‌మ్మ‌త్తుగా ఉంది క‌దూ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube