ఆ ఏపీ మంత్రి ప‌డిపోయే వికెట్టే.. అందుకే సైలెంటా ?

కురుపాం ఎమ్మెల్యే, డిప్యూటీసీఎం, గిరిజ‌న శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి ఏమ‌య్యారు.దాదాపు మూడు మాసాలుగా ఆమె అడ్ర‌స్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 That Ap Minister Is A Runaway Wicket So Why Silent,ap,ap Political News,latest-TeluguStop.com

అందునా అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆమె ఎక్క‌డా నోరు విప్ప‌డం లేదు క‌దా క‌నీసం జాడ కూడా లేకుండా పోయింద‌నే చ‌ర్చ వైసీపీలో జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.ఎక్క‌డ ఏం జ‌రిగింది?  అస‌లు దీనికి కార‌ణాలేంటి?  అనే చ‌ర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది.గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గం కురుపాం నుంచి రెండు సార్లు గెలిచిన పుష్ప శ్రీవాణికి జ‌గ‌న్ డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇచ్చారు.అయితే.జిల్లాలో మంత్రి బొత్స‌స‌త్య‌నారాయ‌ణ దూకుడు ముందు ఆమె నిల‌వలేక పోయార‌నేది వాస్త‌వం.

దీనికితోడు సొంత మామ జ‌గ‌న్ సర్కారుపై విమ‌ర్శ‌లు చేశారు.

ఇక‌, అప్ప‌టి నుంచి కూడా పుష్ప శ్రీవాణి పెదవి విప్ప‌డం లేదు.బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు.

క‌నీసం అధికారిక కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రు కావ‌డం లేదు.దీనివెనుక‌ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఉన్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

సీఎం జ‌గ‌న్ సూచ‌న‌ల‌తో పుష్ప శ్రీవాణికి స‌జ్జ‌ల క్లాస్ తీసుకున్నార‌ని క‌నీసం కుటుంబ స‌భ్యుల‌ను కూడా కంట్రోల్ చేసుకోలేక పోతే ఎలా ? అని ఆయ‌న ప్ర‌శ్నించార‌ని కొన్నాళ్ల కింద‌టే వార్త‌లు వ‌చ్చాయి.అయితే అప్ప‌ట్లోనే ఆమె మ‌న‌స్థాపానికి గుర‌య్యి రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది.

Telugu Ap, Decided, Fall, Jagan, Latest, Pushpa Sreevani, Ysrcp Ledaers, Ysrcp M

అయితేగిరిజ‌న శాఖ‌కు చెందిన మంత్రి కావ‌డం, అందునా ఏరికోరి తెచ్చుకుని కీల‌క ప‌ద‌విని అప్ప‌గించి ఉండ‌డంతో మ‌ధ్య‌లోనే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తే వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని భావించిన స‌జ్జ‌ల అప్ప‌ట్లో ఆమెకు స‌ర్దిచెప్పారు.అయిన‌ప్ప‌టికీ పుష్ప శ్రీవాణి మాత్రం తన‌కు పార్టీ ప‌రంగా మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేద‌ని త‌న‌కు మంత్రి బొత్స అడుగ‌డుగునా అడ్డు ప‌డుతున్నార‌నే వాద‌న వినిపించారు.అయితే పార్టీ నుంచి అప్ప‌టి కీ ఆమెకు మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు.దీంతో రాజీనామాకు సిద్ధ‌మ‌య్యారు.కానీ స‌జ్జ‌ల దీనికి ఒప్పుకోలేదు.ఇక‌, ఎలానూ రెండున్న‌రేళ్ల త‌ర్వాత‌ ప‌ద‌వి త‌న‌కు ఉండ‌ద‌ని డిసైడ్ అయిన నేప‌థ్యంలో ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మొత్తానికి ప‌డిపోయే వికెట్ డిసైడ్ అయింద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube