ఆ న‌టుడి వ‌ల్లే టాలీవుడ్‌కు కేసీఆర్‌కు దూరం పెరిగిందా ?  

ఔను! ఇప్పుడు ఈమాటే వినిపిస్తోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు ఎంతో అండ‌గా ఉంటుంద‌ని త‌మ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తుంద‌ని టాలీవుడ్‌పై తెలంగాణ అధినేత‌, సీఎం కేసీఆర్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.

TeluguStop.com - That Actor Who Created Distance Between Kcr And Tollywood

ఈ క్ర‌మంలోనే క‌రోనా అనంత‌రం టాలీవుడ్‌ను ఆదుకునేందుకు అనేక రూపాల్లో ఆయ‌న ప్ర‌య‌త్నించారు.టాలీవుడ్ ప్ర‌ముఖులు ఏం కోరినా చేశారు.

పైగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంద‌ని అంటూనే టాలీవుడ్ కోరిన‌ట్టు థియేట‌ర్ల కరెంటు బిల్లుల‌ను మాఫీ చేశారు.

TeluguStop.com - ఆ న‌టుడి వ‌ల్లే టాలీవుడ్‌కు కేసీఆర్‌కు దూరం పెరిగిందా -General-Telugu-Telugu Tollywood Photo Image

ప‌న్నులు మాఫీ చేశారు.

జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు ఆర్థిక సాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. రాష్ట్ర జీఎస్టీని తీసుకోబోమ‌ని చెప్పారు.

ఇన్ని చేసిన కేసీఆర్ టాలీవుడ్ నుంచి గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారాన్ని ఆశించ‌క‌నే ఆశించారు.ఆ ప్ర‌చారం ప్ర‌త్య‌క్షంగా కావొచ్చు ప‌రోక్షంగా కావొచ్చు.

మొత్తానికి ప్ర‌చారం మాత్రం చేస్తార‌ని అనుకున్నారు.కానీ, టాలీవుడ్ ప్ర‌ముఖులు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా.

ముందుకు రాలేదు.ప్ర‌త్య‌క్షంగా ల‌బ్ధి పొందిన వారి నుంచి ప‌రోక్షంగా ప్ర‌యోజ‌నాలు పొందిన వారు కూడా కేసీఆర్ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌లేదు.

కేటీఆర్ చేసిన విజ్ఞ‌ప్తికి కూడా స్పందించ‌లేదు.

దీంతో టాలీవుడ్‌పై కేసీఆర్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.ఇదిలావుంటే.ఎక్క‌డో క‌ర్ణాట‌క‌లో ఉన్న బ‌హుభాషా నాయ‌కుడు ప్ర‌కాష్ రాజ్ అనూహ్యంగా కేసీఆర్‌కు, టీఆర్ ఎస్‌కు, కేటీఆర్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

అంతేకాదు గ్రేట‌ర్ ప్ర‌జ‌లు టీఆర్ ఎస్‌కే ఓటు వేయాలంటూ ట్వీట్ చేశారు.ఇది నిముషాల వేగంతో గ్రేట‌ర్‌ను చుట్టేసింది.దీంతో కేసీఆర్ హ‌మ్మ‌య్యఅని ఊపిరి పీల్చుకున్నారు.దీనికి ప్ర‌కాష్ ట్వీట్ క‌న్నా ఆ ట్వీట్‌లో ప్ర‌కాష్ చేసిన కామెంట్లు ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూప‌డం ఖాయ‌మ‌ని కేసీఆర్ అనుకున్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితికే నా మ‌ద్ద‌తు.హైద‌రాబాద్ ప్ర‌జ‌లు విచ‌క్ష‌ణ‌తో ఓటేయాలి.

సామ‌ర‌స్యాన్ని పెంపొందించే పార్టీల‌కే అండ‌గా ఉండాలి.విభ‌జ‌న వాద‌న రాజ‌కీయాల‌కు.

విభ‌జ‌న వాద పార్టీల‌కు త‌గిన బుద్ధి చెప్పండి.హైద‌రాబాద్‌లో శాంతి యుత వాతావ‌ర‌ణం కోరుకునేవారు.

సామ‌ర‌స్యాన్ని పెంపొందిస్తున్న పార్టీకే ఓటేయండి.నేను టీఆర్ ఎస్‌కు, కేసీఆర్‌కు, కేటీఆర్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నా“ అని ప్ర‌కాష్ రాజ్ ట్వీట్ చేయడం సంచ‌ల‌నం గా మారింది.

మ‌రోవైపు.తాను ఎంతో చేసిన టాలీవుడ్ క‌న్నా ప్ర‌కాష్ రాజ్ బెట‌ర్ అని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇది కేసీఆర్‌కు టాలీవుడ్‌కు మ‌ధ్య గ్యాప్ పెంచింద‌ని అంటున్నారు.మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

#Prakash Raj #Harish Rao #Telangana #Chief Minister #Kavitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు