ఈ నగరానికి ఏమైంది అంటోన్న దాస్  

Tharun Bhascker Viswak Sen Ee Nagaraniki Emaindi - Telugu Ee Nagaraniki Emaindi, Tharun Bhascker, Viswak Sen, Web Series

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.యూత్‌ను ఆకట్టుకునే కొత్త జోనర్‌లతో సినిమాలు చేసి ఆయన ప్రేక్షకుల మెప్పు పొందాడు.

 Tharun Bhascker Viswak Sen Ee Nagaraniki Emaindi

కాగా ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే యూత్‌ఫుల్ మూవీతో ప్రేక్షకులను మెప్పించాడు తరుణ్.

ఇక ఈ సినిమాతో హీరోగా విశ్వక్ సేన్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నగరానికి ఏమైంది అంటోన్న దాస్-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమా తరువాత తనే సొంతంగా డైరెక్షన్ చేస్తూ తెరకెక్కించిన ఫలక్‌నుమా దాస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది.ఇక ఇటీవల హిట్ అనే సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న విశ్వక్ సేన్‌ను మరోసారి డైరెక్ట్ చేయనున్నాడు తరుణ్ భాస్కర్.

ప్రస్తుతం అంతా వెబ్ సిరీస్‌ల మయం కావడంతో, త్వరలోనే విశ్వక్ సేన్ కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో అతడు నటించబోయే ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

విశేషమేమిటంటే ఈ వెబ్ సిరీస్‌కు కూడా ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే టైటిల్‌ను పెట్టారట.మొత్తానికి మరోసారి ఈ నగరానికి ఏమైంది అంటూ తరుణ్ భాస్కర్ – విశ్వక్ సేన్‌లు మనల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tharun Bhascker To Direct Viswak Sen Related Telugu News,Photos/Pics,Images..