రెండు ఏషియన్ అవార్డులకి నామినేట్ అయిన తాప్సి తప్పడ్ మూవీ  

Thappad Bags Two Nominations At 14th Asian Film Awards, Taapsee Pannu, Anubhav Sinha, Bollywood, Indian Cinema - Telugu 14th Asian Film Awards, Anubhav Sinha, Bollywood, Indian Cinema, Taapsee Pannu, Thappad Movie

మహిళల ఆత్మగౌరవం అనే ఎలిమెంట్ ప్రధానాంశంగా తీసుకొని బాలీవుడ్ లో తాప్సి మెయిన్ లీడ్ లో అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తప్పడ్.ఈ సినిమా రిలీజ్ తర్వాత అద్భుతమైన విజయం అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది.

TeluguStop.com - Thappad Bags Two Nominations At 14th Asian Film Awards

భార్య అనే అతి చనువుతో ఆమెని ఎక్కడ, ఎలా అవమానించిన భరిస్తుంది అనే పురుషాధిక్యత ఈ సినిమా వేలెత్తి చూపించింది.ఈ సినిమా మహిళలని విశేషంగా ఆకట్టుకుంది.

ఒక్క చెంప దెబ్బకె భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి కోర్టు వరకు వెళ్లిన ఒక సాధారణ, మధ్యతరగతి గృహిణి పాత్రలో తాప్సి నటనకి కూడా మంచి ప్రశంసలు లభించాయి.తాప్సిలో ఎంత గొప్ప నటి ఉందో అనే విషయం తప్పడ్ తో అందరికి అర్ధమైంది.ఇదిలా ఉంటే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమాకి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

TeluguStop.com - రెండు ఏషియన్ అవార్డులకి నామినేట్ అయిన తాప్సి తప్పడ్ మూవీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

14వ ఆసియన్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లో రెండు పురస్కారాలకి నామినేట్ అయ్యింది.11 దేశాల నుంచి 39 సినిమాలు ఈ అవార్డులకు నామినేట్‌ అయ్యాయి.ఈసారి అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆన్‌లైన్‌ ద్వారా జరుపబోతున్నారు.

అక్టోబర్‌ 28న ఈ ప్రదానోత్సవం జరుగనుంది.ఇక ఈ అవార్డుల రేసులో ఏకంగా రెండు విభాగాలలో తప్పడ్ అవార్డులకి నామినేట్ అవ్వడంపై హీరోయిన్ తాప్సి తన ఆనందాన్ని పంచుకుంది.

నేను నటించిన సినిమాకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కటం చాలా ఆనందంగా ఉంది.ఇది మా సినిమాకి దక్కిన గౌరవమే కాదు.

మహిళలకు లభించిన గౌరవం కూడా.ఈ సినిమా ద్వారా దర్శకుడు అనుభవ్‌ సిన్హా ఏమైతే చెప్పాలనుకున్నారో అది అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా రీచ్‌ అయ్యింది అని తాప్సీ ఆనందం వ్యక్తం చేశారు.

#Taapsee Pannu #Anubhav Sinha #14thAsian

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Thappad Bags Two Nominations At 14th Asian Film Awards Related Telugu News,Photos/Pics,Images..