37 ఏళ్లకే బిలియనీర్ : వాల్‌స్ట్రీట్‌లో ఓ భారత సంతతి కుర్రాడి విజయగాథ.. ఎవరీ బైజు భట్

కాలంతో పాటు యువత ఆలోచనలు మారుతున్నాయి.గతంలో మాదిరిగా చదువు అయిపోయిన వెంటనే మంచి ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడిపోవాలనే ఛట్రం నుంచి యువత బయటకొస్తోంది.

 Thanks To Stunning Growth Of Robinhood Baiju Bhatt Becomes Latest Indian American Billionaire-TeluguStop.com

సొంతంగా కంపెనీని ప్రారంభించి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు.ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించిన స్టార్టప్ నినాదం యువతను ఆ దిశగా ఆలోచింపజేస్తోంది.

ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం నుంచి ప్రోత్సాహం లభిస్తుండటంతో యువత దూసుకెళ్తున్నారు.అందుకే సరికొత్త ఆవిష్కరణలతో చరిత్ర సృష్టిస్తున్నారు.

 Thanks To Stunning Growth Of Robinhood Baiju Bhatt Becomes Latest Indian American Billionaire-37 ఏళ్లకే బిలియనీర్ : వాల్‌స్ట్రీట్‌లో ఓ భారత సంతతి కుర్రాడి విజయగాథ.. ఎవరీ బైజు భట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటి వారిలో ఒకరు భారత సంతతికి చెందిన బైజు ప్రఫుల్ కుమార్ భట్.రాబిన్‌హుడ్ అనే ట్రేడింగ్ యాప్ ద్వారా ఉచితంగా స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన సలహాలు సూచనలు అందిస్తూ 37 ఏళ్లకే బిలియనీర్‌గా మారాడు ప్రఫుల్ కుమార్.

గుజరాత్‌కు చెందిన భారతీయ సంతతి తల్లిదండ్రులకు జన్మించిన భట్.భౌతిక శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేషన్ చేసి, 2008లో ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.2013లో తన స్నేహితుడు వ్లాదిమిర్ టెనెవ్‌తో కలిసి రాబిన్‌హుడ్‌ను స్థాపించారు.ప్రస్తుతం భట్.ఈ యాప్‌కు చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.

రాబిన్ హుడ్ అనేది అమెరికాలో ఉచితంగా సేవలందించే స్టాక్ ట్రేడింగ్ యాప్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

ఆర్ధిక వ్యవస్థలను అందరికీ అందుబాటులో వుంచాలన్న లక్ష్యంతో రాబిన్‌హుడ్‌ను ఏర్పాటు చేశారు.సీఎన్ఎన్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రఫుల్ మాట్లాడుతూ.ట్రేడింగ్ స్టాక్‌లను ఈ మెయిల్ సులభంగా, ఉచితంగా అందించడం ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ ప్రపంచాన్ని సమం చేయాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.నిజానికి, రాబిన్‌హుడ్ స్థాపన నుంచి బ్రోకరేజ్‌ పరిశ్రమలో నో కమీషన్ ట్రేడింగ్ మోడల్ విస్తృతమైంది.

దాదాపు 10 లక్షల మంది వినియోగదారులతో నేడు ఈ సంస్థ అమెరికాలోని అతిపెద్ద ఆర్ధిక సంస్థలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఇటీవల రాబిన్ హుడ్‌ పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది.

Telugu Baiju Bhatt Becomes Latest Indian American Billionaire, Baiju Praful Kumar Bhat, Facebook, No Commission Trading Model, Robinhood, Thanks To Stunning Growth Of Robinhood, Twitter, Undergraduate In Physics, Wall Street-Telugu NRI

బైజు ప్రతిరోజు కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతాడు (వారాంతాల్లో కూడా).ఎట్టిపరిస్ధితుల్లోనూ ఉదయం 7 గంటలకల్లా ఆఫీసుకు చేరుకుంటాడు.తొలుత వ్యక్తిగత కార్యక్రమాల కోసం మొదటి రెండు గంటలు కేటాయించి, ఆపై డిజైనర్లు, కొత్త నియామకాలు ఇతర అవసరాలపై దృష్టి సారిస్తాడు.సోషల్ మీడియాపై అంతగా ఆసక్తి చూపని బైజు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, స్లాక్‌లలో ఖాతాలు కలిగి వున్నాడు.అయినప్పటికీ నోటిఫికేషన్లను ఎప్పుడూ మ్యూట్ చేసే వుంచుతాడట.

బిజీ లైఫ్‌లో చురుగ్గా వుండేందుకు గాను మధ్యాహ్న భోజనం పూర్తి చేసిన తర్వాత ఒక గంట పాటు జాగింగ్ చేయడంతో పాటు స్వచ్ఛమైన గాలి వుండే ప్రాంతాల్లో గడుపుతాడు.తద్వారా రోజంతా ఫుల్ జోష్‌లో వుంటాడు.

#Robinhood #Wall Street #Twitter #BaijuBhatt #BaijuPraful

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు