తల్లిదండ్రులకి మర్చిపోలేని బహుమతి ఇచ్చిన సందీప్ కిషన్  

Thankful Sundeep Kishan Gifts Benz To Parents-gifts Benz To Parents,telugu Cinema,thankful Sundeep Kishan,tollywood

తెలుగులో ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ కిషన్.కెరియర్ లో సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న కూడా వరుస సినిమాలు చేస్తూ ముందుకి వెళ్తున్నాడు.నటుడుగా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన సందీప్ కిషన్ సక్సెస్ కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు.ప్రస్తుతం హాకీ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఏ౧ ఎ1 ఎక్స్ ప్రెస్ అనే సినిమాలో సందీప్ కిషన్ నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Thankful Sundeep Kishan Gifts Benz To Parents-gifts Benz To Parents,telugu Cinema,thankful Sundeep Kishan,tollywood Telugu Tollywood Movie Cinema Film Latest News-Thankful Sundeep Kishan Gifts Benz To Parents-Gifts Parents Telugu Cinema Thankful Tollywood

ఇదిలా ఉంటె సందీప్ కిషన్ తన తల్లిదండ్రులకి ఓకే అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.ఇప్పుడు దీనికి సంబందించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బెంజ్‌ మోడల్‌ కారును తన తల్లిదండ్రులకు అందజేసిన ఈ హీరో వారిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు.ఇంతకాలం తన ఇష్టాలను భరించి ఎంచుకున్న రంగంలో ప్రోత్సహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

దీనికి సంబంధించి ఆయన ట్విటర్‌లో ఎమోషనల్ గా ఓ మెసేజ్ పోస్ట్‌ చేశారు.నన్ను, నా ఎంపికలను ఎంతో ఓపికగా భరించినందుకు అమ్మ, నాన్నకు ధన్యవాదాలు.నా వృతిల్లో ఉన్న ఒడిదుడుకులను అర్థం చేసుకోవడం ఎంతో కష్టమో నాకు తెలుసు.ఈ కానుకను మీకు అందజేయడానికి చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాను.

లవ్‌ యూ.డాడీ మీరు ఎంతో జాగ్రత్తగా కారు డ్రైవ్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ పేర్కొన్నారు.అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన షేర్‌ చేశారు.