యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య విభిన్న కథలను ఎంచుకుంటూ తన విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఈ మధ్యనే నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమా విజయం సాధించడంతో ముందు కంటే మరింత ఫాలోయింగ్ సాధించి ముందుకు సాగుతున్నాడు.
ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు.
హర్రర్ అండ్ రోమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇందులో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇది ఇలా ఉండగా.ఈ రోజు ఉదయం నుండి ఈ సినిమా పై ఒక రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఈ సినిమాను ఓటిటీ లోనే రిలీజ్ చేస్తున్నారు అంటూ ఒక రూమర్ బయటకు వచ్చింది.కొద్దీ సమయంలోనే ఈ వార్త అందరికి తెలిసి పోవడంతో మేకర్స్ ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసారు.
కొద్దీ సేపటి క్రితం ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ లో ఒక ప్రకటన విడుదల చేసింది.” థాంక్యూ “సినిమా ప్రెసెంట్ షూటింగ్ దశలోనే ఉంది.అపారమైన నమ్మకంతో, అంకితభావంతో ఈ సినిమాను నిర్మించాము.ఇది పెద్ద తెరపై మాత్రమే చూడడం ఒక మంచి అనుభవం అని మేము నమ్ముతున్నాము.ఇక ఈ సినిమాను సరైన సమయం వచ్చినప్పుడు థియేటర్స్ లోనే విడుదల చేస్తాం అని ఆ రూమర్ పై క్లారిటీ ఇచ్చేసారు.దీంతో ఇక్కడికి ఈ రూమర్ ఆగిపోయింది.