వదంతులను నమ్మవద్దు.. చై సినిమాపై క్లారిటీ వచ్చేసింది!

Thank You Will Release In Theaters Only Producer Clarity

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య విభిన్న కథలను ఎంచుకుంటూ తన విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఈ మధ్యనే నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

 Thank You Will Release In Theaters Only Producer Clarity-TeluguStop.com

ఈ సినిమా విజయం సాధించడంతో ముందు కంటే మరింత ఫాలోయింగ్ సాధించి ముందుకు సాగుతున్నాడు.

ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు.

 Thank You Will Release In Theaters Only Producer Clarity-వదంతులను నమ్మవద్దు.. చై సినిమాపై క్లారిటీ వచ్చేసింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హర్రర్ అండ్ రోమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇందులో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇది ఇలా ఉండగా.ఈ రోజు ఉదయం నుండి ఈ సినిమా పై ఒక రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ సినిమాను ఓటిటీ లోనే రిలీజ్ చేస్తున్నారు అంటూ ఒక రూమర్ బయటకు వచ్చింది.కొద్దీ సమయంలోనే ఈ వార్త అందరికి తెలిసి పోవడంతో మేకర్స్ ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసారు.

కొద్దీ సేపటి క్రితం ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ లో ఒక ప్రకటన విడుదల చేసింది.” థాంక్యూ “సినిమా ప్రెసెంట్ షూటింగ్ దశలోనే ఉంది.అపారమైన నమ్మకంతో, అంకితభావంతో ఈ సినిమాను నిర్మించాము.ఇది పెద్ద తెరపై మాత్రమే చూడడం ఒక మంచి అనుభవం అని మేము నమ్ముతున్నాము.ఇక ఈ సినిమాను సరైన సమయం వచ్చినప్పుడు థియేటర్స్ లోనే విడుదల చేస్తాం అని ఆ రూమర్ పై క్లారిటీ ఇచ్చేసారు.దీంతో ఇక్కడికి ఈ రూమర్ ఆగిపోయింది.

#Naga Chaitanya #Theaters #Ups #Vikram Kumar #Rashi Khanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube