ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అతి త్వరలో బిచ్చగాడు 3 - విజయ్ ఆంటోనీ

విజయ్ ఆంటోనీ( Vijay Antony ) స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా బిచ్చగాడు 2.( Bichagadu 2 ) రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ తో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

 Thank You Everyone For Giving Such A Big Success With Bichagadu 2 Bichagadu 3 Wi-TeluguStop.com

ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ నగరాల్లోని బిచ్చగాడు2 థియేటర్స్ కు వెళ్లి సందడి చేసింది మూవీ టీమ్.అలాగే రాజమండ్రి లో నిజమైన బిచ్చగాళ్లకు ఓ స్టార్ హోటెల్లో విందు కూడా ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన సందర్భంగా మూవీ సక్సెస్ మీట్ ను( Bichagadu 2 Success Meet ) ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా తెలుగు అనువాద రచయిత భాషా శ్రీ మాట్లాడుతూ.” బిచ్చగాడు2ను ఇంత పెద్ద హిట్ చేసి విజయ్ఆంటోనీ గారిని ఆశీర్వదించినందుకు థ్యాంక్యూ.నేను ఈ చిత్రానికి మాటలు, పాటలు రాశాను.

మామూలుగా సినిమాల రిలీజ్ కు ముందు ఫంక్షన్స్ లో ఆ చిత్రాల గురించి ఓ రేంజ్ లో చెబుతాం.కానీ రిలీజ్ తర్వాత రెండు రోజుల పాటు బయటకు రాలేం.

కానీ బిచ్చగాడు2 సినిమా మమ్మల్ని కాలర్ ఎత్తుకు తిరిగేలా చేసింది.అందుకు కారణం ప్రేక్షకులే.

ఇప్పుడు సక్సెస్‌ మీట్ నిర్వహించుకునేంత పెద్ద హిట్ ఇచ్చారు.సిస్టర్ సెంటిమెంట్, కట్టిపడేసే క్లైమాక్స్, ఓ గొప్పవాడు అనుకుంటే పేదవారిని ఎలా ఆదుకోవచ్చు అనేవి హైలెట్ గా నిలిచాయి.

ఈ సందర్భంగా నిర్మాత గురించి చెప్పాలి.వాళ్ల కృషి లేకుంటే ఇంత పెద్ద విజయం సాధ్యం కాదు.

కొన్ని సినిమాలు జనాల్లోకి వెళ్లకపోతే హిట్ కావు అనేందుకు విజయ్ ఆంటోనీ గత కొన్ని సినిమాలు ఉదాహరణ.ఈ మూవీ నిర్మాతలు చాలా ప్రమోషన్స్ చేశారు.

ఈ మూవీ విడుదలకు ముందు విజయ్ ఆంటోనీ గారికి ప్రమాదం అయిందని ఆయన భార్య ఎమోషనల్ అయ్యారు.బట్ ఇంతమంది ఆశీర్వాదం ఉండగా ఆయనకేం కాదు.” అన్నారు.

Telugu Chandu Sai, Bichagadu, Bichagadu Meet, Fatimavijay, Vijay Antony, Vijayan

డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ మాట్లాడుతూ.” బిచ్చగాడు2 సినిమా సక్సెస్ మీట్ లో మీ అందరితో పాటు మా నిర్మాత ఫాతిమాగారికి, సినిమాకు అన్నీ అయిన విజయ్ ఆంటోనీ గారిని, మా తోటి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఈ మూవీని అందరూ బిచ్చగాడుతో పోల్చుకుని ఆడియన్స్ అద్భుతమైన ఓపెనింగ్స్ ఇచ్చారు.దానికి తగ్గకుండా.బిచ్చగాడు2 కలెక్షన్‌స్ పరంగా రిచ్ గాడు అనిపించాడు.ఒక సీక్వెల్ తీసి గ్రాండ్ సక్సెస్ చేయడం మాటలు కాదు.మీ శ్రమకు మంచి ఫలితం వచ్చింది.భవిష్యత్ లో బిచ్చగాడు3 కూడా తీయాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ సురేష్‌ మాట్లాడుతూ.” బిచ్చగాడు2 డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినందుకు విజయ్ ఆంటోనీ, ఫాతిమా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.ఈ చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు.” అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ వీరి నాయుడు మాట్లాడుతూ.” ఈ సినిమా ప్రారంభానికి ముందే మేం ఈ చిత్రంలో భాగస్వామ్యం కావాలని ఫాతిమా, విజయ్ గారు కోరుకున్నారు.ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారా రారా అనుకున్న టైమ్ లో అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి.ఓపెనింగ్స్ తోనే అఖండ విజయం సాధించింది ఈ చిత్రం.ఈ చిత్ర దర్శకుడు హీరో విజయ్ ఆంటోనీ, నిర్మాత ఫాతిమాగారికి నా కృతజ్ఞతలు.” అన్నారు.

Telugu Chandu Sai, Bichagadu, Bichagadu Meet, Fatimavijay, Vijay Antony, Vijayan

వైజాగ్ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.” బిచ్చగాడు2 సక్సెస్ మీట్ కు వచ్చిన పెద్దలు.దర్శకుడుతో పాటు అన్నీ ఆయనే నడిపిస్తోన్న విజయ్ ఆంటోనీ గారికి నమస్కారం.బిచ్చగాడు పెద్ద విజయం సాధించింది.ఈ రెండో భాగం కూడా అంతకు మించి విజయం సాధించడం ఆనందం.తెలుగు ప్రేక్షకులు వారిని బాగా ఆదరిస్తున్నారు.

ఇలాంటి రియల్ హీరోస్ కు తెలుగువారు సపోర్ట్ గా ఉండి ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నాను.ఇంత మంచి సినిమా తీసినందుకు ఆయన్ని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి.

క్యాన్సర్ పేషెంట్స్, పూర్ పీపుల్ కు సాయం చేస్తున్నారు.వారు కూడా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారని అనుకుంటున్నాను.భవిష్యత్ లో విజయ్ గారి సినిమాలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్యూ సో మచ్.“అన్నారు.

Telugu Chandu Sai, Bichagadu, Bichagadu Meet, Fatimavijay, Vijay Antony, Vijayan

నటుడు చందు సాయి మాట్లాడుతూ.” ఈయన నిజంగానే చాలా మనస్ఫూర్తిగా బిచ్చగాళ్లతో కలిశారు.వారితో మాట్లాడ్డమే కాదు.వారిని ముట్టుకున్నారు.ఫోటోస్ దిగారు.నిజంగా ఇలా ఎవరూ చేయరు.

ఈ కాన్సెప్ట్స్ అన్నీ డైరెక్ట్ చేసింది నేనే.నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్యూ సో మచ్.” అన్నారు.

నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.” ఒక వారం రోజులుగా తిరుగుతూనే ఉన్నాను.నాకు జ్వరంతో గొంతు పోయింది.

కానీ మీ అందరినీ చూడగానే జ్వరం పోయింది.దేవుడితో పాటు మీ అందరికీ థ్యాంక్యూ.

మీరు లేకపోతే విజయ్ ఆంటోనీ, ఫాతిమా ఎవరూ లేరు.యాక్సిడెంట్ తర్వాత చెప్పింది ఏంటంటే.

నో టియర్స్ (కన్నీళ్లు) ఓన్లీ హ్యాపీనెస్.ఇప్పుడు అదే చేస్తున్నా.

ఇప్పుడు నో టియర్స్.ఫుల్ హ్యాపీ.

ఏదీ అప్పుడు ప్లాన్ చేయలేదు.అలా జరిగిపోయింది.

ఇక తెలుగులో డిస్ట్రిబ్యూషన్ విషయంలో కొంత కన్ఫ్యూజ్ అయ్యాం.ఈ చిత్రాన్ని ఎవరైతే ప్రేక్షకుల దగ్గరకు బాగా తీసుకువెళ్తారా అనుకున్నాం.

అప్పుడు చాలామంది వచ్చారు.కానీ నాకు ఎవరూ నచ్చలేదు.

ఒక ఇద్దరు మాత్రం ప్రొడ్యూసర్స్ నాకు తండ్రిలా, బ్రదర్ లా నచ్చారు.వారిని చూశాక నమ్మకం కలిగింది.

వీళ్లు సినిమాకు ఆడియన్స్ ముందుకు తీసుకువెళతారు అని.సినిమా స్టార్ట్ చేయడానికి ముందే మాకు సపోర్ట్ గా ఉన్నారు.తండ్రిలా ముందుండి నడిపించారు.ప్రేక్షకులతో పాటు ఈ జర్నీలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాను.” అన్నారు.

Telugu Chandu Sai, Bichagadu, Bichagadu Meet, Fatimavijay, Vijay Antony, Vijayan

హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.మీ అందరికీ బిచ్చగాడు నచ్చింది.సపోర్ట్ చేశారు.ఇప్పుడు బిచ్చగాడు2 నచ్చింది.మంచి విజయం ఇచ్చారు.ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను.బిజీ షెడ్యూల్ కారణంగా కుదరడం లేదు.

నెక్ట్స్ టైమ్ ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతాను.ఈ సందర్భంగా ఓ సంతోషకరమైన వార్త షేర్ చేసుకుంటున్నాను.

త్వరలోనే బిచ్చగాడు3 చేయబోతున్నాను.బిచ్చగాడు 3 మూవీ( Bichagadu 3 ) 2025 లేదా 2026 బిగినింగ్ లో విడుదలవుతుంది.

ఈ విజయం నా ఒక్కడిది కాదు.నా టీమ్ మొత్తం సపోర్ట్ చేసింది.

నా భార్య ఫాతిమా సపోర్ట్ మరవలేను.నా అసిస్టెంట్ డైరెక్టర్స్, టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను.

ఏ విజయాన్ని మనం ఒక్కరమే ఓన్ చేసుకోలేం.ప్రతి విజయంలో భాగస్వాములు ఉంటారు.

ఉషాపిక్చర్స్ వీరి నాయుడు గారు ప్రతి సందర్భంలో సపోర్ట్ గా ఉన్నారు.వారితో పాటు సురేష్‌, విజయ్ బాబు, అండగా నిలిచారు.

రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇల్లు కొంటాను.నా సినిమాల షూటింగ్స్ కూడా ఆంధ్రా, తెలంగాణలో షూటింగ్ చేసేలా ప్లాన్ చేసుకుంటాను.ఈ సక్సెస్ మీట్ విజయవంతం కావడానికి తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వ కృతజ్ఞతలు చెబుతున్నాను.” అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube