ఇంటా బయటా నిరాశ పరిచిన చైతూ 'థాంక్యూ'.. మరి నెక్స్ట్ ఏంటి?

మన టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు.మరి అలాంటి డైరెక్టర్లలో విక్రమ్ కే కుమార్ ఒకరు.

 Thank You Box Office Collection, Naga Chaitanya, Rashi Khanna, Thank You Movie-TeluguStop.com

ఈయన తీసిన సినిమాలన్నీ ఒక క్లాసిక్ సినిమాలుగా మిగిలి పోయాయి.ఒక మనం.ఒక 24 సినిమా.ఇలా ఈయన సినిమాలో కథాంశం ను మలచిన తీరు ప్రేక్షకులను ఆకట్టు కుంది.మరి అలాంటి డైరెక్టర్ సినిమా అంటే ఎలా ఉండాలి.

కానీ చైతూ తో తీసిన థాంక్యూ సినిమా మాత్రం ఫుల్ అపోజిట్ ఉంది.

మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్న చైతూకు ఇప్పుడు థాంక్యూ పెద్ద షాక్ ఇచ్చింది.ఎంత అంటే కోలుకోలేని స్థితిలోకి నాగ చైతన్య వెళ్లిపోయేలా ఆయనపై వరుస కామెంట్స్ చేస్తున్నారు.

ముందు నుండే థాంక్యూ సినిమాపై అంచనాలు లేవు.ఉన్న బజ్ కూడా రిలీజ్ అయినా ఫస్ట్ డే రోజు పోయింది.

నెగిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. విక్రమ్ తీసిన 24, హలొ సినిమాలు ఓవర్సీస్ లో అయినా రాబట్టాయి.

కానీ నాగ చైతన్యు థాంక్యు సినిమా మాత్రం ఇంట మాత్రమే కాదు బయట కూడా రాబట్టలేక పోయింది.

Telugu Naga Chaitanya, Rashi Khanna, Box-Movie

అమెరికాలో ఈ సినిమా 200 కు పైగానే లొకేషన్స్ లో రిలీజ్ అయినా కూడా తక్కువ వసూళ్లు సాధించింది.వీకెండ్ లో ఈ సినిమా కేవలం 165 కె డాలర్లు మాత్రమే రాబట్టింది.ఇంతటి పరాజయం రావడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా కష్టమే అంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య తన బాలీవుడ్ డెబ్యూ సినిమా ప్రొమోషన్స్ లో బిజీ కానున్నాడు.ఆగష్టు 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

కొద్దిగా గ్యాప్ తర్వాత ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొననున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube