అమెరికాలో ఉంటున్న తెలుగు వారు ఎంతో మంది తెలుగు సంస్కృతీ సాంప్రదాయలని మర్చిపోకుండా సందర్భాను సారంగా పాటిస్తుంటారు.అమెరికాలో ఉండే ఎన్నో తెలుగు సంఘాలు తెలుగు సాంప్రదాయాలకి అనుగుణంగా కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి.
అంతేకాదు తెలుగు బాషపై మక్కువతో, తెలుగుని తమ పిల్లలకి నేర్పాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది ఆ కోరికని సాకారం చేయడానికి అమెరికాలో ఏర్పాటు చేసిందే “పాఠశాల”.
తానా, పాఠశాల రెండు సంస్థలు కలిసి తెలుగుని బ్రతికించుకోవడానికి చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం అనే చెప్పాలి.అందుకు అనుగుణంగా అమెరికాలో తెలుగు నేర్చుకుంటున్న చిన్నారులకి ఈ రెండు సంస్థలు కలిసి తెలుగు పోటీలని నిర్వహిస్తున్నాయి.అందులో భాగంగానే లాస్ఏంజెల్స్, అట్లాంటా, ఫిలడెల్ఫియా, కనెక్టికట్, మిన్నెసొటాలో తెలుగు పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలలో పాల్గొని విజయం సాధించిన చిన్నారులకి బహుమతులు కూడా అందించారు.సౌత్ కాలిఫోర్నియాలో జరిగిన ఈ పోటీలని వాణి కందిపతి, శిరీష అల్లాని పర్యవేక్షించారు.
ఫిలడెల్ఫియాలో జరిగిన పోటీలని , లక్ష్మీ ముద్దన , నాగరాజు నలజుల, పర్యవేక్షించారు.ఇలా వివిధ ప్రాంతాలలో ఆయా ప్రాంత తానా సభ్యులు పోటీలని పర్యవేక్షించి విజేతలకి బహుమతులు అందించారు.