రొమాన్స్ చేయడం మరిచిపోయానంటున్న మిల్కీ బ్యూటీ

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007లో విడుదలైన హ్యాపీడేస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టారు తమన్నా.వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగి తమన్నా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

 Thamanna Bhatia Comments In Gurtunda Seethakalam Movie Audio Function, Gurtunda-TeluguStop.com

అయితే తమన్నా సోలో హీరోయిన్ గా నటించిన సినిమాలు అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు.అవకాశాలు తగ్గిన సమయంలో బాహుబలి సినిమా తమన్నా కెరీర్ ను మలుపు తిప్పింది.
బాహుబలి సినిమా ఇండస్ట్రీ హిట్ ఫలితాన్ని అందుకున్న తరువాత అడపాదడపా అవకాశాలతో తమన్నా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.ప్రస్తుతం తమన్నా సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రెస్ మీట్ లో తమన్నా మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లాక్ డౌన్ సమయంలో తాను ఈ కథ విన్నానని కథ ఎంతో నచ్చి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పారు.

Telugu Gurtundaseetha, Kannadanaga, Naga Shekar, Romantic, Satyadev, Thamanna-Mo

ఈ మధ్య కాలంలో తను నటించిన సినిమాలన్నీ కత్తులు పట్టుకుని నటించినవే అని రొమాన్స్ చేయడం పూర్తిగా మరిచిపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గుర్తుందా శీతాకాలం లాంటి సినిమాలో నటించి చాలా రోజులైందని.మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని.ఈ సినిమాలోని హీరో పాత్రకు సత్యదేవ్ పర్ఫెక్ట్ అని తమన్నా వ్యాఖ్యలు చేశారు.

దర్శకుడు నాగ శేఖర్ కన్నడ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారని ఆయన తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంటారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు.తమన్నా ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం సినిమాతో పాటు అంధాధూన్, సీటీమార్ సినిమాల్లో నటిస్తున్నారు.

నెలరోజుల క్రితం కరోనా బారిన పడి కోలుకున్న తమన్నా ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలను ప్రకటించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube