Thaman dsp : వరెస్ట్ పెర్ఫార్మెన్స్ లో పోటీ పడుతున్న థమన్, డిఎస్పీ ..ఏందయ్యా మా కర్మ కాకపోతే

అయ్యో దేవుడా…రాను రాను సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి పోతుంది అస్సలు అర్థం కావడం లేదు.ఒక పక్కన తమ సినిమాలను విజయవంతం చేయడానికి దర్శకులు, హీరోలు పాటలు పడుతుంటే ఆ సినిమాలకు సంగీతం అందించే వారు కూడా ఒక రకంగా బలంగానే కష్టపడుతున్నారు.

 Thaman Vs Dsp: Chiru Vs Balayya , Thaman , Dsp , Bala Krishan, Chiran Jevvi, Ve-TeluguStop.com

అయితే వారి కష్టంలో నిజాయితీ ఎంత ఉంది అనే దాని పైన మాత్రమే జనాలు శ్రద్ధ వహిస్తున్నారు.ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సంగీతం పరంగా మొదటి ఒకటి, రెండు స్థానాల్లో టాప్ లో ఉన్న వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం డిఎస్పీ మరియు థమన్ మాత్రమే.

అతి త్వరలో విడుదల కాబోతున్న చిరంజీవి చిత్రం వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ థమన్ లు సంగీతం అందించి వారే పాట రాసి, ట్యూన్ కట్టి, చివరికి వారే పాడి, పాటలో మాస్ మాస్ స్టెప్పులు కూడా వేస్తున్నారు.సినిమా హిట్ అయిన ప్లాప్ అయినా ఇప్పుడు వీరి హడావిడి మాత్రం దారుణంగా ఉందనే చెప్పాలి.

వాల్తేరు వీరయ్య నుంచి మొన్న దేవి శ్రీ ప్రసాద్ ఒక పాటను విడుదల చేశాడు.దాంట్లో దేవి శ్రీ ప్రసాద్ అన్ని తానే భుజాన మోసిన ఆ పాట మెగా అభిమానులకు అస్సలు నచ్చలేదు.

అసలు మాస్ పాటకి చిరంజీవి వేస్తున్న స్టెప్పులకి సంబంధం లేకుండా సోసో గా ఉంది ఈ పాట.

Telugu Bala Krishan, Chiran Jevvi, Thaman, Tollywood-Latest News - Telugu

ఈ పాట విడుదలైన తర్వాత సంగీతం ఇచ్చినది డిఎస్పీ నే అనే డౌట్ కూడా వచ్చింది.ఐక్య మెగా కాంపౌండ్ లో కాస్త వేడి వాతావరణం సృష్టించిందని తెలుస్తోంది.ఇక బాలకృష్ణ సినిమా వీర సింహ రెడ్డి కోసం థమన్ కూడా తానే పాట రాసి, పాడి ట్యూన్ కట్టి చివరికి అతడే పాడి మాస్ స్టెప్స్ ని కూడా వేసి తనకు సూటు గాని లావైన బంగారంతో కళ్ళద్దాలతో తెల్లటి బట్టల్లో స్టెప్పులు వేశాడు.

పోనీ ఈ పాట ఏమైనా బాగుందా అంటే అది బాగాలేదు.ఇప్పుడు ఈ ఇద్దరు సంగీత దర్శకులు వారి పాటలతో జనాలకు మతులు పోగొట్టారు.అలాగే ఇద్దరు హీరోల సినిమాలను ముంచేలా కూడా కనిపిస్తున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube