థమన్ వర్సెస్ అనిరుద్.. ఒక్క సినిమాతో లెక్కలు మారాయి..!

సినిమా సక్సెస్ విషయంలో మ్యూజిక్ అనేది చాలా ప్రాధాన్యత చోటు చేసుకుంటుంది.సినిమా రిలీజ్ కు ముందు ఆడియెన్స్ లో సినిమాపై ఆసక్తి కలిగేలా చేసేది మ్యూజిక్ మాత్రమే.

 Thaman Vs Anirudh Ravinchandra Fight For Bgm , Akhanda, Anirudh Ravichandra,bgm,-TeluguStop.com

సాంగ్స్ తో పాటుగా టీజర్, ట్రైలర్ లో వచ్చే బిజిఎం తో ఈసారి మ్యూజిక్ డైరక్టర్ కుమ్మేస్తాడని అంచనా వేస్తారు.అనుకున్నట్టుగానే స్టార్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువ ఇంపార్టెన్స్ తెచ్చుకుంటుంది.

సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ మ్యూజిక్ డైరక్టర్స్ ఇస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనిపిస్తుంది.

తెలుగు మ్యూజిక్ డైరక్టర్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే అంతకుముందు మణిశర్మ గురించి చెప్పుకునే వారు.

ఆయన ఇచ్చే ఆర్.ఆర్ సినిమాకు ఎంతో క్రేజ్ తెస్తుందని అంటుంటారు.అయితే ప్రస్తుతం మణిశర్మ ఫాం లో లేడు ఆయన ప్లేస్ లో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొడుతున్నాడు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు థమన్.

థమన్ మ్యూజిక్ అంటే సాంగ్స్ తో పాటుగా అతను సినిమాకు ఇచ్చే బిజిఎం కూడా హైలెట్ గా నిలుస్తున్నాయి.

Telugu Akhanda, Thaman, Tollywood, Vikram-Movie

అయితే ఈమధ్య వచ్చిన విక్రం సినిమా చూశాక అనిరుద్ రవిచంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఫిదా అయ్యారు తెలుగు ఆడియెన్స్.స్టైలిష్ యాక్షన్ సినిమాకు కావాల్సిన బిజిఎం తో అనిరుద్ అదరగొట్టాడు.అయితే ఇప్పుడు థమన్ వర్సెస్ అనిరుద్ ల మధ్య ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫైట్ జరుగుతుంది.

రాబోతున్న సినిమాల్లో థమన్, అనిరుద్ రవిచంద్రల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది.థమన్ ప్రస్తుతం శంకర్, చరణ్ సినిమాతో పాటుగా మహేష్, త్రివిక్రం సినిమా చేస్తున్నాడు.అనిరుద్ మాత్రం ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబో సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలతో వారి మధ్య సూపర్ ఫైట్ జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube