వాళ్ల గూబ గుయ్‌మనిపించిన థమన్

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తుకువచ్చే పేరు ఎస్.థమన్.

 Thaman Silenced All Negative Comments With His Music, Thaman, Ala Vaikuntapuramu-TeluguStop.com

గతేడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ పాటలతో అదిరిపోయే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్, అప్పటివరకు థమన్ ఓ కాపీ క్యాట్ అనేవాళ్ల నోరు మూయించాడు.‘అల వైకుంఠపురములో’ పాటలు సంచలన రికార్డలు క్రియేట్ చేయడంతో థమన్ మ్యూజిక్‌కు ఎదురే లేదని పలువురు చెప్పుకొచ్చారు.

అయితే థమన్ గురించి పలు పుకార్లు మాత్రం సోషల్ మీడియాలో ఆగడం లేదు.

ఇటీవల థమన్ వరుసగా పలు బడా చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రానికి తొలుత థమన్‌ను సంగీతం అందించేందుకు తీసుకున్నారని, కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి థమన్‌ను తప్పించారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.దీంతో ఈ సినిమా నుండి థమన్ నిజంగా తప్పుకున్నాడా అని అందరూ ఆసక్తిగా చూశారు.

కానీ తాను ఈ సినిమా నుండి తప్పుకోలేదని, తనపై అనవసర పుకార్లు, నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నవారికి గూబ గుయ్‌మనిపించేలా చెప్పాడు థమన్.

తాజాగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌ను అద్భుతంగా కంపోజ్ చేసిన థమన్, ఈ పాట విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ముఖ్యంగా పవర్ స్టార్ లాంటి హీరోకు ఎలాంటి అంశంతో పాటను అందిస్తే అది హిట్ అవుతుందో, అలాంటి అంశాలను పూర్తిగా వాడి భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌ను ఓ పవర్‌ఫుల్ ట్రీట్‌లా అందించాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.ఇక భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ఎలాంటి తుఫాను క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.

ఏదేమైనా థమన్ సంగీతంతో అందరికీ సమాధానం చెప్పాడనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube