మహేష్‌ సర్కారు వారి పాట అప్‌డేట్‌  

Mahesh Babu Sarkaru Vari Pata Latest Update About Music Director, Thaman, Mahesh Babu, Sarkaruvari Pata, Parushuram, Ala Vaikuntapuramlo - Telugu Ala Vaikuntapuramlo, Mahesh Babu, Parushuram, Sarkaruvari Pata, Thaman

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట చిత్రం కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే సూపర్‌ స్టార్‌ కృష్ణ బర్త్‌డేకు మహేష్‌బాబు ప్రీ లుక్‌ విడుదల చేయడంతో పాటు టైటిల్‌ లోగోను అఫిషియల్‌గా అనౌన్స్‌ చేశారు.

TeluguStop.com - Thaman Mahesh Babu Sarkaruvari Pata Parushuram Ala Vaikuntapuramlo

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక మరికొన్ని రోజుల్లో మహేష్‌బాబు బర్త్‌డే రాబోతున్న నేపథ్యంలో సందడి చేసేందుకు రెడీ అయ్యారు.సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం చేయలేదు.

TeluguStop.com - మహేష్‌ సర్కారు వారి పాట అప్‌డేట్‌-Movie-Telugu Tollywood Photo Image

కనుక ఎలాంటి అప్‌డేట్‌ వచ్చే అవకాశం లేదని అంతా అనుకున్నారు.కాని ఫ్యాన్స్‌ను సంతృప్తి పర్చేందుకు సంతోషపర్చేందుకు గాను బర్త్‌డే గిఫ్ట్‌ రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేష్‌బాబు సర్కారు వారి పాట చిత్రం మొదటి సాంగ్‌ గింపుల్స్‌ ను విడుదల చేయబోతున్నారు.థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఒక పాటను నిమిషం నిడివి ఉన్న వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఈ విషయంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.థమన్‌ అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ బిగ్గెస్ట్‌ మ్యూజిక్‌ ఆల్బం చేశాడు.అందుకే ఈ చిత్రంకు కూడా ఆయన మంచి పాటలు ఇస్తాడని ఆశిస్తున్నారు.

దర్శకుడు పరశురామ్‌ మెల్లగా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడు.డైలాగ్‌ వర్షన్‌ కూడా దాదాపుగా పూర్తి అయ్యింది.ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నాయి.

త్వరలోనే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.కరోనా పరిస్థితులు ఎప్పటి నుండి అయితే తగ్గుముకం పడతాయో, ఎప్పుడైతే జన జీవనం యధా స్థితికి వస్తుందో అప్పుడే సర్కారు వారి పాట పట్టాలు ఎక్కబోతుంది.

అంటే నవంబర్‌ లేదా డిసెంబర్‌ లో సినిమా మొదలయ్యే ఛాన్స్‌ ఉంది.వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి కానుకగా ఈ చిత్రంను విడుదల చేసే అవకాశం ఉంది.

#Thaman #Parushuram #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Thaman Mahesh Babu Sarkaruvari Pata Parushuram Ala Vaikuntapuramlo Related Telugu News,Photos/Pics,Images..