సర్కారు వారి హడావుడి మామూలుగా లేదు.. థమన్‌ జాగ్రత్త సుమ

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు సంగీతాన్ని థమన్ అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి మొదటి పాటను మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

 Thaman Hype Comments On Mahesh Babu Sarkaru Vaari Pata Movie First Song-TeluguStop.com

అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలను మించి సర్కారు వారి పాట సినిమాలోని పాటలు ఉంటాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్‌ వ్యూస్ ను దక్కించుకున్న అల వైకుంఠపురంలో సినిమా పాటలను మించి సర్కారు వారి పాటలకు సంబంధించిన వ్యూస్ ఉంటాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు తో గతంలో థమన్‌ మ్యూజికల్‌ సక్సెస్ ను దక్కించుకున్నాడు.కనుక ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా మహేష్‌ బాబు అభిమానుల కోసం మ్యూజికల్‌ సక్సెస్‌ ను థమన్‌ అందిస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు.

 Thaman Hype Comments On Mahesh Babu Sarkaru Vaari Pata Movie First Song-సర్కారు వారి హడావుడి మామూలుగా లేదు.. థమన్‌ జాగ్రత్త సుమ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సర్కారు వారి పాట సినిమా మొదటి పాట విడుదల కాబోతున్న నేపథ్యంలో వారం రోజులుగా డేస్ టు గో అంటూ కౌంట్‌ డౌన్ ను వేస్తున్నారు.ఈ సమయంలో థమన్ ట్విట్టర్‌ ద్వారా సినిమా పాట పై హైప్‌ క్రియేట్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాడు.

అలా సర్కారు వారి పాట సినిమా ను థమన్‌ ఆకాశమే హద్దు అన్నట్లుగా లేపేస్తున్నాడు.

Telugu Mahesh Babu Sarkaru Vaari Pata, Parashuram, S S Thaman, Sarkaru Vaari Pata, Sarkaru Vaari Pata Movie Song, Thaman-Movie

సాంగ్ చరిత్రలో నిలిచి పోతుంది అంటూ నేడు ట్విట్టర్‌ లో కామెంట్‌ పెట్టాడు.ఆ తేదీని మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్‌ అవ్వడంతో పాటు ఎప్పటికి నిలిచి పోయే రికార్డును దక్కించుకుంటుంది అన్నట్లుగా థమన్‌ కామెంట్‌ చేశాడు.మొత్తానికి సర్కారు వారి పాట సినిమా నుండి రాబోతున్న పాట పై పీక్స్ లో అంచనాలు పెట్టాడు.

మరి అంచనాలను అందుకోలేక పోతే మాత్రం థమన్‌ కు ట్రోల్స్ తప్పవు.జాగ్రత్త థమన్ మరీ ఎక్కువ పెంచేస్తున్నావు.ఏమాత్రం తక్కువ అయినా కూడా నిన్ను మహేష్‌ అభిమానులు ఆడేసుకుంటారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

#Thaman #MaheshBabu #Parashuram #Thaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు