టక్ జగదీష్‌కు సాలిడ్‌గా ఇస్తోన్న థమన్

టాలీవుడ్‌లో ఇటీవల సూపర్ హిట్ మ్యూజిక్‌ను అందిస్తూ తనదైన మార్క్ వేసుకుంటున్న థమన్, ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు.థమన్ కోసం పలువురు స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు.

 Thaman Gives Solid Album For Tuck Jagadish, Tuck Jagadish, Nani, Thaman, Ala Vai-TeluguStop.com

అయితే చేతిలో అరడజను సినిమాలు ఉన్న థమన్, ఎలాంటి వేరియేషన్ చూపిస్తూ ఆకట్టుకునే సంగీతం అందిస్తాడా అనేది చాలా ఆసక్తిగా మారింది.కాగా థమన్ సంగీతం అందిస్తున్న చిత్రాల్లో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీష్ అనే సినిమా ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా కోసం థమన్ అదిరిపోయే సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా కోసం రికార్డింగ్ కూడా పూర్తి చేసినట్లు, నాని ఇమేజ్‌కు తగ్గట్టుగా అదరగొట్టే సంగీతం ఈ సినిమాలో ఉండబోతున్నట్లు థమన్ అంటున్నారు.

తొలిసారి నాని సినిమాకు వర్క్ చేస్తున్న థమన్, ఆయన సినిమాకు సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు.ఇక ఈ సినిమాలోని అన్ని పాటలకు సంగీతం పూర్తయ్యిందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

కాగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు అనుమతిని ఇవ్వడంతో ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుండగా, ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

మరి ఈ సినిమాలోని సంగీతం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే పాటలు రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube