ఆ సినిమాలోది లేపేశారంటు థమన్ పై ట్రోలింగ్..?

సినీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.

 Ss Thaman Gets Trolled By Pawan Fans Over Copied Tune In Bheemla Nayak,  Ss Tham-TeluguStop.com

థమన్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఈయన తన సంగీతంతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.2008లో తెలుగు, తమిళ సినిమాలలో పాడి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సినిమాలలో కూడా తన పాటలను వినిపించాడు.

ఇక ఈయన పాటలు చాలా వరకు కాపీ చేస్తాడని ఎన్నో వార్తలు వినిపించాయి.ఇదిలా ఉంటే తాజాగా మరో పాటను కూడా కాపీ చేశారంటూ తెగ ట్రోలింగ్స్ వస్తున్నాయి.

ఇంతకీ తను పాడిన పాట ఏ సినిమాకో కాదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కనున్న అయ్యప్పనుమ్ కోషియం.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇటీవలే భీమ్లా నాయక్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.ఈ సినిమా మలయాళంలో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.

ఈ సినిమాకు థమన్ తన సంగీతాన్ని వినిపిస్తున్నాడు.

Telugu Bheemla Nayak, Peta, Rajnikanth, Rana, Sai Pallavi, Ss Thaman, Thaman, To

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందుతుంది.తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ కూడా విడుదల కాగా ఇందులో థమన్ ఇస్తున్న పాటలు ఎక్కువగా కాపీ ట్యూన్ చేస్తున్నాడు అని ట్రోలింగ్స్ చేస్తున్నారు.గతంలో కూడా ఈ మాటే వినిపించగా.అది కాపీ చేసినది కాదని థమన్ గతంలోనే తెలిపాడు.

Telugu Bheemla Nayak, Peta, Rajnikanth, Rana, Sai Pallavi, Ss Thaman, Thaman, To

కాని కొందరు పవన్ అభిమానులు ఈ పాట వేరే సినిమా నుండి కాపీ కొట్టినట్లు ఉందని అనగా.అదికూడా రజినీకాంత్ పెట్టా అనే సినిమాలో కొంత భాగం పాటను పవన్ సినిమాలో వాడాడని తెగ ప్రచారాలు వినిపిస్తున్నాయి.దీంతో ఈ విషయం గురించి థమన్ స్పందించకపోగా.

ఇటువంటివి రిపీట్ చేయకూడదు అని పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్ ద్వారా తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube