స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కు సరికొత్త తలనొప్పి..

ఎస్ ఎస్ థమన్. తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్.

 Thaman Facing Troubles Sarkaru Vari Paata Mahesh Babu Details, Thaman ,facing Troubles, Sarkaru Vari Paata ,mahesh Babu, Keerthy Suresh, Tollywood, Music Director Thaman, Sarkaru Vari Paata First Single, Pawan Kalyan-TeluguStop.com

ఆయన చేస్తున్న ప్రాజెక్టులన్నీ వరుస విజయాలు అందుకుంటున్నాయి.గడిచిన రెండు సంవత్సరాలుగా ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది.

చాలర్ట్ బస్టర్ ఆల్బమ్స్ రూపొందిస్తూ మంచి స్వింగ్ లో కొనసాగుతున్నారు.సినిమా సక్సెస్ తో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు తమన్.

 Thaman Facing Troubles Sarkaru Vari Paata Mahesh Babu Details, Thaman ,facing Troubles, Sarkaru Vari Paata ,mahesh Babu, Keerthy Suresh, Tollywood, Music Director Thaman, Sarkaru Vari Paata First Single, Pawan Kalyan-స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కు సరికొత్త తలనొప్పి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం భారీ ప్రాజెక్టులకు ఫస్ట్ ఛాయిస్ అయ్యాడు.థమన్ మ్యూజిక్ అందించాడు అంటే కనీసం ఆడియో రైట్స్ కు ఐదు కోట్ల రూపాయలు వస్తాయనే టాక్ నడుస్తుంది.

నిర్మాతలు మంచి లాభాలు అందుకోవడంలో తన వంతు సహకరిస్తున్నాడు తమన్.కవర్ సాంగ్స్ విషయంలో మాత్రం ఇబ్బంది కరంగా మారుతున్నాడనే టాక్ నడుస్తుంది.

ఇంతకీ ఎందుకు ఆ అభిప్రాయం కలుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అల వైకుంఠపురంలో సినిమా విజయంలో థమన్ కీ రోల్ పోషించాడు అని చెప్పుకోవచ్చు.

ఈయన కంపోజ్ చేసిన ప్రతి పాట జనాలను ఓ రేంజిలో ఆకట్టుకున్నాయి.సినిమా విజయంలో ఆయన మ్యూజిక్ ఎంతగానో సహకరించింది.

ఈ సినిమా పాటలన్నీ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.ఈ సినిమాకు సంబంధించి లిరికల్ వీడియోలకు బదులుగా కొన్ని కవర్ సాంగ్స్ విడుదల చేశారు.

అయితే ఈ ఐడియా వర్కౌట్ అయ్యింది.దీంతో థమన్ మ్యూజిక్ అందిస్తున్న పెద్ద సినిమాల విషయంలో లిరికల్ వీడియోలు కాకుండా కవర్ సాంగ్స్ షూట్ చేస్తున్నారు.

అయితే పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం తమన్ పై వ్యంగ్యంగా కామెంట్లు విసురుతున్నారు.పాటలు బాగున్నాయ్ అంటూనే కవర్ సాంగ్స్ పై ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా తమన్ సర్కారు వారి పాట సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు.ఇప్పటికే రిలీజ్అయిన మోషన్ పోస్టర్ కు అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది.అటు వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న SVP ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇందులో మహేష్ ఫోటో కాకుండా కేవలం తమన్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ పోస్టర్ వదిలారు.దీనిపై మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ చేయాలా? వద్దా? అని మదనపడుతున్నాడట తమన్.

Video : Thaman Facing Troubles Sarkaru Vari Paata Mahesh Babu Details, Thaman ,facing Troubles, Sarkaru Vari Paata ,mahesh Babu, Keerthy Suresh, Tollywood, Music Director Thaman, Sarkaru Vari Paata First Single, Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube