మళ్ళి దొరికిపోయిన తమన్

Thaman Copied Again

పాపం కష్టాలన్నీ తమన్ కే వస్తాయి అనుకుంటా .మొన్నటికి మొన్న డిక్టేటర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు అన్న జనాలే నిన్నటి నుంచి తిట్టుకుంటున్నారు .

 Thaman Copied Again-TeluguStop.com

తమన్ ఇంతే ఇక మారడు అని ఫిక్స్ అయిపోతున్నారు .ఎంత చేరిపేసుకుందామనుకున్న కాపి క్యాట్ అనే ముద్ర తమన్ ను వీడేలా లేదు.ఇంతకీ ఏం జరిగింది ?

నిన్న డిక్టేటర్ సాంగ్ ఒకటి విడుదల చేసారు .గమ్ గమ్ గణేశా అనే పల్లవి తో సాగే ఈ పాట మొదటిసారి వినగానే బాగా అనిపించింది.రెండో సారికి ఇంతకు ముందు ఎక్కడో విన్నాట్టు అనిపించింది .మూడో సారికి హిందీ పాట అని గుర్తొచ్చింది .నాలోగో సారికి అందరికి అర్థమైపోయింది .సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ లోనే ” లే లే లే సెల్ఫి లేలేరే” అనే పాట నుంచి తమన్ బాబు బిట్స్ లేపేసాడని .ఇంకేం ఒకరి నుంచి ఒకరికి, ఫేస్ బుక్, ట్విట్టర్ లో అందరికి తెలిసిపోయింది ఈ విషయం .మళ్ళి తమన్ ని తిట్టుకోవడాలు, జోక్స్ వేయడాలు మొదలయ్యాయి.తమన్ కాపి కొట్టడం ఎప్పుడు మానేస్తాడో ఏమిటో .అందులోను జనాలలో పాపులర్ అయిన పాటలనే కాపి కొట్టాలా !

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube