ఇలా చేస్తే తల్లి నుండి గర్భంలో ఉన్న పిల్లలకు ఎయిడ్స్ సోకదు.! తప్పక తెలుసుకోండి!       2018-06-13   05:01:13  IST  Raghu V

ఎయిడ్స్..అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. ఇది సోకడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అరుదుగా కొందరు పసి కందులకు గర్భంలో ఉండగా తల్లి నుంచి ఎయిడ్స్‌ సోకకపోగా, ప్రసవం తర్వాత కూడా వాళ్లు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారు. ఇలాంటి పిల్లల మీద జరిపిన పరిశోధనలో ‘రెగ్యులేటరీ లింఫోసైట్‌’ అనే ఒక ప్రత్యేకమైన ‘ట్రెగ్‌’ కణం హెచ్‌ఐవి వైరస్‌ సోకకుండా రక్షణ కల్పిస్తున్నట్టు తేలింది. అట్లాంటాలోని అమెరికన్‌ సొసైటీ ఫర్‌ మైక్రోబయాలజీ చేపట్టిన పరిశోధనలో ఈ కణాలను పరిశోధకులు గుర్తించారు.

-

పసికందులకు హెచ్‌ఐవి నుంచి రక్షణ కల్పిస్తున్న ఈ సరికొత్త ఆరోగ్య విధానాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయగలిగితే, మనుషుల్లో రోగనిరోధక వ్యవస్థను మరింత బలపరిచి, ఎయిడ్స్‌ నుంచి రక్షణ కల్పించగలిగే మార్గాలను అన్వేషించవచ్చని పరిశోధకులు అంటున్నారు. ఇప్పటిదాకా ఎంతో కొంతమంది పసికందులకు మాత్రమే ప్రసవం ద్వారా తల్లుల నుంచి హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ సోకడం పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌తో పుట్టినా యాంటీరిట్రోవైరల్‌ డ్రగ్స్‌ ఇచ్చి, వాటిని జీవితాంతం కొనసాగించగలిగితే తల్లి నుంచి బిడ్డకు ఎయిడ్స్‌ సోకకుండా నివారించే వీలుంది. ఇదే విధానాన్ని ఇప్పటిదాకా అనుసరిస్తూ వస్తున్నారు. అయితే హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ను పూర్తిగా నివారించగలిగితే పిల్లలతోపాటు, పెద్దలూ ఈ వ్యాధి నుంచి రక్షణ పొందే వీలు కలుగుతుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.