హలో తెలుగు సూపర్‌ స్టార్స్‌ ఈయన్ను ఒక్కసారి చూడండి  

Hello Telugu Super Stars Look At This Tamil Super Star-mahesh,prabhas,tamil Super Star,thale Vijay,విజయ్‌

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.ఆయన విజిల్‌ ఆన్‌ సెట్స్‌లో ఉండగానే ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాడు.

Hello Telugu Super Stars Look At This Tamil Star-Mahesh Prabhas Tamil Star Thale Vijay విజయ్‌

విజిల్‌ ఎప్పుడైతే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదల అయ్యిందో వెంటనే లోకేష్‌ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాడు.ప్రస్తుతం లోకేష్‌ దర్శకత్వంలో చేస్తూనే మరో దర్శకుడికి విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

అంటే సంవత్సరంలో కనీసం రెండు లేదా మూడు సినిమాలను విజయ్‌ విడుదల చేసేందుకు చాలా కష్టపడుతున్నారు.

అదే మన తెలుగు హీరోలు మాత్రం ఏడాదికి ఒక్కటి మాత్రమే విడుదల చేస్తున్నారు.

ప్రభాస్‌ వంటి స్టార్స్‌ ఏడాదిలో కనీసం ఒక్కటి కూడా విడుదల చేయలేక పోతున్నాడు.ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో టాలీవుడ్‌లో హీరోల ఫ్యాన్స్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అసలు తెలుగు హీరోలు ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారో అర్థం అవ్వడం లేదు అంటూ అభిమానులు అంటున్నారు.ఇందులో అర్థం అవ్వక పోవడంకు ఏముంది ఒక్క సినిమా అవ్వగానే మరో సినిమా కోసం కనీసం మూడు నాలుగు నెలల గ్యాప్‌ తీసుకుంటారు.

ఆ గ్యాప్‌ కారణంగానే సినిమాకు సినిమాకు మద్య ఏడాది గ్యాప్‌ వస్తుంది.ఉదాహరణకు సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈఏడాది ఆరంభంలో విడుదల అయ్యింది.

వెంటనే మరో సినిమాను ప్రారంభించినట్లయితే ఇదే ఏడాది చివరి వరకు మహేష్‌బాబు సినిమా వచ్చేది.కాని మహేష్‌బాబు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో అమెరికాలో ఉన్నాడు.

వచ్చిన తర్వాత కూడా కొంత రెస్ట్‌ తీసుకుని తదుపరి చిత్రంలో నటిస్తాడు.ఇలాంటి కారణాల వల్ల స్టార్‌ హీరోలు ఒకటి మాత్రమే చేస్తున్నారు.

ఏది ఏమైనా ఈ విషయంలో మాత్రం మన హీరోలు వారిని చూసి నేర్చుకోవాలంటూ అభిమానులు కోరుతున్నారు.

తాజా వార్తలు

Hello Telugu Super Stars Look At This Tamil Super Star-mahesh,prabhas,tamil Super Star,thale Vijay,విజయ్‌ Related....