కోడెల మృతికి బాబు కారణం  

Thalasani Srinivas Yadav Comments On Kodela Sivprasad Dead - Telugu Chandrababu Naidu, Telangana Minister Talasani Srinivas Yadav, Thalasani Srinivas Yadav

ఏపీ మాజీ మంత్రి, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతిపై వైకాపా తెలుగు దేశం పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఈ సమయంలోనే తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ నాయకుడు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ కోడెల మృతి తనకు తీవ్ర మనోవేదనకు గురి చేసిందని బాధ పడ్డాడు.

Thalasani Srinivas Yadav Comments On Kodela Sivprasad Dead

కోడెలతో తలసానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఇద్దరు ఒకప్పుడు తెలుగు దేశం పార్టీలో పని చేశారు.

చాలా ఏళ్లుగా ఇద్దరి మద్య సన్నిహిత్యం ఉంది.ఆ విషయాలను గుర్తు చేసుకుని తలసాని బాధ పడ్డారు.

కోడెల మృతికి బాబు కారణం-Latest News-Telugu Tollywood Photo Image

ఇక కోడెల మృతికి ప్రధాన కారణం చంద్రబాబు అంటూ తలసాని మండి పడ్డాడు.గత కొన్ని రోజులుగా కోడెలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వక పోవడంతో పాటు, పలు విషయాల్లో కోడెలను చంద్రబాబు నాయుడు ఒంటరిగా వదిలేయడం జరిగింది.

గతంలో ఇద్దరు చేసిన పనులు ఇప్పుడు కోడెల మెడకు చుట్టుకున్నాయి.అందుకే ఆయన బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.మూడు నెలలుగా కోడెలకు చంద్రబాబు అపాయింట్‌ మెంట్‌ ఇవ్వలేదు.ఇప్పుడు కోడెల చనిపోయిన తర్వాత శవ రాజకీయాలు చేసేందుకు ముందుకు వస్తున్నాడంటూ తలసాని మండి పడ్డాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు