రక్తపు మారకలతో షాక్ ఇచ్చిన విజయ్.. నెట్టింట ఫోటోలు వైరల్?

సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించాలంటే దర్శకనిర్మాతలు చిత్రబృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.ఆ సినిమా నుంచి ఏ విధమైనటువంటి సన్నివేశాలు ఫోటోలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు పడుతున్నప్పటికీ కొందరు లీకు రాయుళ్లు మాత్రం సినిమాకు సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తుంటారు.

 Thalapathy Vijays Beast Shooting Spot Pic Leaked Again-TeluguStop.com

ఇప్పటికే ఈ విషయంపై ఎంతో మంది దర్శక నిర్మాతలు హీరోలు గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈ లీకీకులపర్వం మాత్రం ఆగడం లేదు.

తాజాగా తమిళం స్టార్ హీరో విజయ్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “బీస్ట్”అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Thalapathy Vijays Beast Shooting Spot Pic Leaked Again-రక్తపు మరకలతో షాక్ ఇచ్చిన విజయ్.. నెట్టింట ఫోటోలు వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ హీరోగా వస్తున్నటువంటి ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా తమిళనాడులోని బ్రిస్క్ అనే ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని షూటింగ్ జరుగుతున్నటువంటి సన్నివేశాలను ఫోన్లలో బంధించి వాటిని నెట్టింట్లో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి.

ఇందులో విజయ్ రక్తపు మరకలు ఉన్నటువంటి తెలుపు రంగు చొక్కాలో కనిపిస్తుండడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈ విషయంపై హీరో విజయ్ స్పందిస్తూ.

అన్ అఫీషియల్ ఫోటోలు వీడియోలను చిత్రీకరించ్చ వద్దని తన అభిమానులకు రిక్వెస్ట్ చేశారు.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.

#Spot #Leaked

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube