బీస్ట్ షూటింగ్ పూర్తి.. సెండ్ ఆఫ్ చెప్పుకున్న టీమ్!

కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయ తలపతి విజయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన చేస్తున్న సినిమాలే ఆయనకు భారీ ఫాలోయింగ్ తెచ్చి పెట్టాయి.

 Thalapathy Vijay Wraps Up Beast Shoot.. Hugs Director Nelson Dilipkumar On Set,-TeluguStop.com

రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ లో అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్ తలపతి.ఈయన చేసిన సినిమాలు రియల్ లైఫ్ కు దగ్గరగా ఉంటాయి.

కాబట్టి అన్ని సినిమాలు ప్రేక్షకులకు గుర్తుండి పోవడమే కాకుండా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.

Telugu Beast, Beast Latest, Pooja Hegde, Thalapathyvijay, Wraps Beast-Movie

విజయ్ గత సినిమా మాస్టర్ కూడా సూపర్ హిట్ సాధించి రికార్డ్ కలెక్షన్స్ కూడా తెచ్చిపెట్టింది.ఈ సినిమా ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి కోలీవుడ్ లో వండర్ సృష్టించింది.ప్రెజెంట్ విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘బీస్ట్’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.విజయ్ 65 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది.

ఈ సినిమా గ్యాంగ్ స్టర్ త్రిల్లర్ గా రూపొందుతుంది.సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే సందడి నెలకొంది.

ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుండి అప్డేట్ వస్తుందా అని అందరు ఎదురు చూసారు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేసారు.

గత శుక్రవారమే పూజా ఈ సినిమాలో తన పార్ట్ షూటింగ్ పూర్తి అయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

Telugu Beast, Beast Latest, Pooja Hegde, Thalapathyvijay, Wraps Beast-Movie

ఇక ఇప్పుడు విజయ్ కూడా సోషల్ మీడియా ద్వారా నెల్సన్ దిలీప్ కుమార్ ను హగ్ చేస్తుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ తన హర్షాన్ని తెలియజేస్తూ ఈ సినిమా షూటింగ్ కు గుడ్ బై చెప్పారు.ఈ సినిమా చివరి షెడ్యూల్ చెన్నై లోని గోకులమ్ స్టూడియోస్ లో జరిగింది.అనిరుధ్  స్వరపరిచిన పాటతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టారు.ఈ విషయాన్నీ బీస్ట్ సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube