స్ట్రైట్ తెలుగు సినిమా చేసే యోచనలో ఉన్న ఇళయదళపతి

ఇళయదళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కోలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజయ్ తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువ అయ్యాడు.

 Thalapathy Vijay Straight Telugu Film With Vamshi Paidipally-TeluguStop.com

కోలీవుడ్ నుంచి హీరో సూర్య, విక్రమ్, విశాల్ లాంటి స్టార్స్ తమ సినిమాలని తెలుగులో డబ్ చేసి హిట్స్ కొట్టడంతో విజయ్ కూడా అదే దారిలో నడిచాడు.ముందుగా అతని హిట్ సినిమాలని తెలుగులో డబ్బింగ్ చేసి వదిలారు.

అయితే అవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తుపాకీ సినిమాతో విజయ్ తెలుగు ప్రేక్షకులకి భాగా చేరువ అయ్యాడు.

 Thalapathy Vijay Straight Telugu Film With Vamshi Paidipally-స్ట్రైట్ తెలుగు సినిమా చేసే యోచనలో ఉన్న ఇళయదళపతి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పటి నుంచి అతని ప్రతి సినిమా కూడా తెలుగు, తమిళ్ బాషలలో ఒకేసారి రిలీజ్ ఉండే విధంగా చూసుకుంటున్నాడు.

ఈ నేపధ్యంలో పోలీసోడు, సర్కార్, అదిరింది, విజిల్, మాస్టర్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులని కూడా మెప్పించాడు.

దీంతో టాలీవుడ్ లో కూడా అతని సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి.ఇదిలా ఉంటే విజయ్ త్వరలో ఓ స్ట్రైట్ తెలుగు సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్ వస్తుంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం ఉంది.రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి విజయ్ కి ఒక కథని నేరేట్ చేశాడని, ఆ స్క్రిప్ట్ భాగా నచ్చడంతో చేయడానికి ఒకే చెప్పెసాడని తెలుస్తుంది.

టాలీవుడ్ ఓ పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చినట్లు సమాచారం.ఇక దీనిని టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కించాలని వంశీ పైడిపల్లి భావిస్తున్నట్లు బోగట్టా.

ఇప్పటికే ఈ మూవీ కన్ఫర్మ్ అయ్యిందని కరోనా సెకండ్ వేవ్ సిచువేషన్ నార్మల్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

.

#Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు