హీరో విజయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. పవర్ స్టార్ కంటే ఎక్కువ?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన కేవలం తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Thalapathy Vijay Remuneration For Dil Raju Vamsi Paidipally Movie , Thalapathy V-TeluguStop.com

తమిళనాడు తర్వాత విజయ్ కు తెలుగులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్  ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే విజయ్ నటించిన ప్రతి ఒక్క సినిమా తెలుగులో తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటుంది.

ఇక ఈయన నటించిన సినిమా మాస్టర్ కూడా తెలుగులో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇప్పటి వరకు విజయ్ తమిళ చిత్రాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసే వారు అలా కాకుండా ఈ సారి పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో విజయ్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాని దీపావళికి విడుదల చేయాలన్న ఉద్దేశంతో నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Telugu Dil Raju, Fans, Kollywood, Pawan Kalyn, Vakeel Sab-Movie

ఈ సినిమా కోసం దిల్ రాజు హీరో విజయ్ కు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకి విజయ్ ఏకంగా వందకు పైగా సుమారు 118 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ చిత్రానికి పవన్ కళ్యాణ్ కు 50 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు.

ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా తీసుకోబోతున్నారు.ఇక ఈ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 స్టూడియో ఏకంగా 200 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక విడుదల కాకుండానే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube