విజయ్ మాస్టర్ రిలీజ్ డేట్ లాక్... అధికారికంగా ఇంకా వెయిటింగ్

కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ నటించిన మాస్టర్ మూవీ గురించే ఇప్పుడు అక్కడ హాట్ చర్చ నడుస్తుంది.ఈ సినిమాకి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా వంద కోట్ల డీల్ ఇచ్చింది.

 Thalapathy Vijay Master Release On January 13, Tollywood, Kollywood, Indian Cine-TeluguStop.com

అయితే మాస్టర్ నిర్మాతలు మాత్రం థియేటర్ రిలీజ్ వైపే ఆసక్తి చూపించారు.మాస్టర్ మూవీని థియేటర్ లో రిలీజ్ చేస్తే ఏకంగా 150 కోట్లు వరకు కలెక్షన్ సునాయాసంగా వస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం వరుస హిట్ లతో దూసుకుపోతున్న విజయ్ మార్కెట్ రేంజ్ బట్టి ఏ విధంగా చూసుకున్న మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్లు వచ్చేస్తుంది.ఈ కారణంగా ఓటీటీ ఆఫర్ ని చిత్ర నిర్మాతలు తిరస్కరించారు.

ఇదిలా ఉంటే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్లు కోలీవుడ్ లో వినిపిస్తుంది.ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Indian, January, Kollywood, Master, Poona Hegde, Pop Pan India, Salman Kh

సంక్రాంతి కానుగా జనవరి 13న ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళిక కూడా రెడీ అయినట్లు సమాచారం.ఇక మాస్టర్ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ కావడానికి రెడీ అవుతుందని తెలియడంతో ఆ సమయంలో రిలీజ్ పెట్టుకున్న చిన్న సినిమాలు అన్ని వెనక్కి వెళ్లిపోతున్నాయి.ఇప్పటికే మాస్టర్ ట్రయిలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.

దీనికి తోడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ ఉండటం వలన సినిమాకి మరింత హైప్ వచ్చింది.ఏది ఏమైనా మాస్టర్ సినిమాపై మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది.

ఈ నేపధ్యంలో విజయ్ ఫ్యాన్స్ కోసం మాస్టర్ సినిమా రిలీజ్ వేడుకలని గ్రాండ్ గా స్టేట్ మొత్తం దద్దరిల్లేలా చేయాలని అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube