కాలేజ్ పొలిటికల్ డ్రామాగా రాబోతున్న విజయ్ "మాస్టర్"..!

టాలీవుడ్ లో ఇది వరకు మెగాస్టార్ నటించిన సినిమాలలో ఒకటి మాస్టర్.అప్పట్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది.

 Tamil Star, Vijay, Master Movie, Trailer, Master Movie Trailer, 3 Idiots, Telugu-TeluguStop.com

ఇదే టైటిల్ తో ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి సినిమా చేశాడు.ఇదివరకు విజయ్ సినిమా డబ్బింగ్ అయితే ఎవరు పట్టించుకునేవారు కాదు.

అయితే ప్రస్తుతం పూర్తిగా పరిస్థితి మారిపోయింది.విజయ్ సినిమాలకు కేవలం తమిళ్ లో మాత్రంమే కాకుండా భారతదేశంలో ప్రతి భాషలో కూడా బాగా మార్కెట్ పెరిగింది.

బాలీవుడ్ లో తెరకెక్కిన 3ఇడియట్స్ సినిమాను తెలుగులో స్నేహితుడు సినిమా ద్వారా బాగా పేరు పొందాడు.ఆ తర్వాత వచ్చిన తుపాకీ సినిమాతో పర్లేదు అనిపించినా ఆ తరువాత వచ్చిన సర్కార్, విజిల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

దీంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ సినిమా అంటే అందరూ ఎదురుచూస్తున్నారు.దర్శక నిర్మాతలు కూడా విజయ్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పది కోట్ల వరకు బిసినెస్ చేయగల నమ్మకం కూడా వారికి వచ్చింది.

ఇకపోతే ఈయన నటించిన మాస్టర్ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ముఖ్యంగా కాలేజ్ పాలిటిక్స్ నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.ఖైదీ సినిమా దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాపై అన్ని వర్గాల లో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇకపోతే మాస్టర్ తో విజయ్ మరికొన్ని రికార్డులను తిరగ రాస్తారని ఎందరో నమ్ముతున్నారు.

వాళ్ల నమ్మకాన్ని మరింతగా పెంచినట్లు అయింది తాజాగా విడుదలైన మాస్టర్ సినిమా ట్రైలర్.

వీడియో చూసిన వారు నిజంగా అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.కాలేజ్ పాలిటిక్స్ లో స్టైలిష్ డ్రామాగా ఈ సినిమా వస్తుందని అర్థమవుతోంది.

ఇకపోతే ఈ సినిమాలో మరో హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.విజయ్ దళపతి, విజయ్ సేతుపతి మధ్య సాగే సన్నివేశాలు తాజాగా విడుదలైన టీజర్ లో హైలెట్ గా నిలిచాయి.

లోకల్ గుండా పాత్రలో విజయ్ సేతుపతి నటిచంగా మరోవైపు విజయ్ దళపతి కాలేజ్ ప్రొఫెసర్ గా కనిపించనున్నారు.ఈ సినిమాలో విజయ్ దళపతి సరసన మాళవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది.

మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.ఇకపోతే మాస్టర్ సినిమా ఓటిటిలో కాకుండా కచ్చితంగా థియేటర్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ధారించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube