14 కోట్లు కాదు 70 లక్షలు.. అభిమానులు హద్దు మీరకండి

కేరళను దాదాపు 15 రోజుల పాటు వరదలు ముంచెత్తిన విషయం తెల్సిందే.కేరళలో వరదల బీభత్సంకు సాదారణ జనజీవనం అస్థవ్యస్థం అయ్యింది.

 Thalapathy Vijay Donate Rs 70 Lakh For Kerala Flood Relief-TeluguStop.com

దాదాపు కేరళలోని సగం వరదలో మునిగి పోయింది.కొన్ని లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.

కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది.ఇలాంటి సమయంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు.

తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.పలువురు హీరోలు మరియు హీరోయిన్స్‌, రాజకీయ వ్యాపార ప్రముఖులు తమకు తోచిన సాయం చేస్తున్నారు.

కేరళను ఆదుకునేందుకు తమిళ స్టార్‌ హీరో ముందుకు వచ్చాడు అని, ఏకంగా 14 కోట్ల విరాళంను కేరళ కోసం విజయ్‌ ప్రకటించాడు అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం మొదలు పెట్టారు.ఏ హీరో లేదా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి ఇంత భారీ మొత్తంలో కేరళకు సాయం చేయలేదు అంటూ విజయ్‌ అభిమానులు పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయడం జరిగింది.దాంతో విజయ్‌పై అంతా కూడా ప్రశంసలు కురిపించారు.విజయ్‌పై ఎంతో మంది అభిమానం పెంచుకున్నారు.అయితే 14 కోట్ల విరాళం కేవలం పుకార్లే అని తేలిపోయింది.

విజయ్‌ సన్నిహితులు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంను కొట్టి పారేశారు.

తాజాగా విజయ్‌ కేరళ కోసం 70 లక్షల రూపాయలను అభిమానులతో కలిసి ప్రకటించడం జరిగింది.తన అభిమాన సంఘంకు చెందిన కొంత మొత్తంతో కలిపి తాను చేయాలనుకున్న సాయంను కలిపి మొత్తం 70 లక్షల రూపాయలను కేరళకు సాయం చేస్తున్నట్లుగా విజయ్‌ ప్రకటించాడు.

కేరళలో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో విజయ్‌ అభిమానులు కొందరు చేసిన పనిని సామాన్యులు విమర్శిస్తున్నారు.తమ హీరో అభిమానం చాటుకునేందుకు ఇదేనా సమయం.కనీసం కోటి కూడా ఇవ్వని హీరో 14 కోట్లు ఇచ్చాడు అంటూ పబ్లిసిటీ చేయడం ఏమాత్రం బాగా లేదు అంటూ యాంటీ విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సౌత్‌ ఇండియా నుండి అత్యధిక విరాళం ఇచ్చిన హీరోగా విజయ్‌ నిలిచాడు.

ఏ హీరో కూడా 70 లక్షల విరాళంను ప్రకటించింది లేదు.సోషల్‌ మీడియాలో వచ్చిన 14 కోట్ల వార్తల కారణంగానే విజయ్‌ ఇంత భారీ మొత్తంలో విరాళం ఇచ్చి ఉంటాడు అంటూ ఒక వర్గం వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube