తలైవి నుంచి కంగనా లుక్... ఈ సారి క్లాసికల్ డాన్స్ లో

పురుచ్చితలివిగా తమిళ ప్రజల నుంచి కీర్తనలు అందుకొని, ముఖ్యమంత్రిగా, అన్నా డిఎంకే అధినేత్రిగా ఎంజీ రామచంద్రన్ వారసత్వం అందుకొని రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి జయలలిత.చైల్డ్ ఆర్టిస్ట్ గా సౌత్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చి తరువాత స్టార్ట్ హీరోయిన్ గా ఎదిగి, తరువాత రాజకీయంలోకి ప్రవేశించి ఎవరూ అందుకోలేని స్థాయిని అందుకున్న ఈమె ప్రయాణంలో ఎన్నో అవమానాలు, మరెన్నో ఆటుపోట్లు ఉన్నాయి.

 Thalaivi Kangana Ranaut-TeluguStop.com

జయలలిత మరణంతో ఇప్పుడు ఆమె కథని వెండితెర మీద ఆవిష్కరించడానికి దర్శకులు సిద్ధమయ్యారు.

జయ జీవిత కథతో రెండు సినిమాలు, ఒక వెబ్ సిరిస్ తెరకేక్కుతూ ఉండగా వాటిలో ఒకటి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న తలైవి.

సుమారు వంద కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రాజకీయ నాయకురాలిగా కంగనా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకురాగా తాజాగా ఆమెలో నటి కోణాన్ని ఆవిష్కరించే విధంగా క్లాసికల్ డాన్స్ లుక్ ని రిలీజ్ చేశారు.

శాస్త్రీయ నృత్యం చేస్తున్న భంగిమలో కంగనా అమితంగా ఆకట్టుకుంటుంది.ఎక్కువ మంది డాన్సర్లు నాట్యం చేస్తుండగా, మధ్యలో జయలలితగా కంగనా నాట్యంచేస్తుంది.ఒకప్పుడు సినిమాలలో క్లాసికల్ డాన్స్ తో ఎక్కువగా పాటలు ఉండేవి ఆ కోవలో పాట చిత్రీకరణకి సంబందించిన ఫోటోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube