పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన త‌లైవా..!

ద‌క్షిణాది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.చెన్నైలో ర‌జ‌నీ త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వితో స‌మావేశం అయ్యారు.

 Thalaiva Has Given Clarity On Political Entry..!-TeluguStop.com

అనంత‌రం మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానమిస్తూ మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న లేద‌ని తేల్చి చెప్పేశారు.

గ‌తంలో త‌లైవా రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఉద్దేశంతో ర‌జ‌నీ మ‌క్క‌ల్ మండ్రం అనే సంస్థ‌ను స్థాపించారు.

ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ కోసం దేశం అంతా ఆస‌క్తిగా ఎదురు చూసిన విష‌యం తెలిసిందే.అయితే ర‌జ‌నీ ఆరోగ్య ప‌రిస్థితి ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీకి బ్రేక్ వేసింది.

గ‌త కొంత‌కాలంగా త‌ర‌చూ అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుండ‌టంతో తాను రాజకీయాల్లోకి రాన‌ని ర‌జ‌నీకాంత్ వెల్ల‌డించారు.అంతేకాకుండా ర‌జ‌నీ మ‌క్క‌ల్ మండ్రం సంస్థ‌ను ర‌ద్దు చేసి, అభిమానుల సంక్షేమ సంఘంగా మార్చేందుకు నిర్ణ‌యించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube