అజిత్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేస్తున్న బోనీ కపూర్  

Thala Ajith Next in a Pan Indian Movie, Valimai Movie, Boney Kapoor, H Vinod, Bollywood, Tollywood - Telugu Bollywood, Boney Kapoor, H Vinod, Thala Ajith Next In A Pan Indian Movie, Tollywood, Valimai Movie

సౌత్ లో ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాల హవా మొదలైంది.స్టార్ హీరోలు అందరూ తమ సినిమాలని పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా 5 భాషలలో రిలీజ్ చేస్తున్నారు.

 Thala Ajith Next In A Pan Indian Movie

ఒకప్పుడు సౌత్ హీరోలు సౌత్ భాషల వరకే పరిమితం అయ్యేవారు.ఇక తెలుగు హీరోలు అయితే ఎంత పెద్ద స్టార్ అయిన తమ సినిమాలని తెలుగు వరకే పరిమితం చేసేవారు.

అయితే సినిమా బడ్జెట్ లు పెరగడంతో మార్కెట్ రేంజ్ పెంచుకోవడానికి తమ సినిమాలని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.దానికోసం అవసరం అయితే ఇతర బాషలలో మార్కెట్ ఉన్న నటులని కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకుంటున్నారు.

అజిత్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేస్తున్న బోనీ కపూర్-Movie-Telugu Tollywood Photo Image

ఇలా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలకి మార్కెట్ చేసుకోవచ్చని బాహుబలి సినిమాతో రాజమౌళి చేసి చూపించారు.ఆ వెంటనే సాహో సినిమాతోనే ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమా చేశాడు.
ఇక కన్నడంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్, రానా, ప్రభాస్, చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ అందరూ పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలని ఆవిష్కరిస్తున్నారు.

ఇక హిందీలో రజినీకాంత్, కమల్ హసన్ కి ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ ఉంది.ఇప్పుడు తలై అజిత్ కూడా పాన్ ఇండియా స్టార్ గానే మారిపోతున్నాడు.

హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వలిమై’ చిత్రంలో అజిత్‌ నటిస్తున్న విషయం విదితమే.

అయితే ఈ చిత్రాన్ని నిర్మాత బోనీకపూర్‌ పాన్‌ ఇండియా సినిమాగా తీసుకురావాలనే యోచనలో ఉన్నారని సమాచారం.తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ దీన్ని నిర్మించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారట.

ఈ చిత్రంలో టాలీవుడ్‌ యువ కథానాయకుడు కార్తీకేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

#H Vinod #Boney Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Thala Ajith Next In A Pan Indian Movie Related Telugu News,Photos/Pics,Images..