కరోనా టైం లో బడులు,చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన థాయ్ ల్యాండ్ సర్కార్

కరోనా టైం లో ప్రపంచ దేశాలు ఏ స్థాయిలో దెబ్బ తిన్నాయో అందరికీ తెలిసిందే.ఈ మహమ్మారికి భయపడి పోయి దాదాపు అన్ని దేశాలు కూడా లాక్ డౌన్ ను విధించడం తో పిల్లల స్కూల్స్ కూడా మూతపడిపోయాయి.

 Thailand Schools Have Reopened With Strict Social Distancing , Thailand Schools,-TeluguStop.com

కరోనా నేపథ్యంలో మార్చి నెలలో మూతపడిన స్కూల్స్ ను జులై లోనే థాయ్ ల్యాండ్ ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.ఈ క్రమంలో భౌతిక దూరం,మాస్క్ లు, శానిటైజేషన్ ఇలా అన్ని చర్యలు తప్పనిసరిగా పాటించాలంటూ సర్కార్ అక్కడ స్కూల్స్ కు సూచనలు చేసింది.

దీనితో అక్కడ స్కూల్స్ యాజమాన్యం ప్రభుత్వం చెప్పిన విధంగా చర్యలు అమలు చేస్తుంది.పిల్లల కోసం ఎవరికీ వారికి వేరుగా బాక్స్ లు ఏర్పాటు చేసి స్కూల్స్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు.

కేజీ విద్యార్థులు అందరూ కూడా ఎవరికీ ఏర్పాటు చేసిన బాక్సు లలో వారే ఉంటూ పాఠాలు నేర్చుకుంటున్నారు.అయితే ఆటలు అనగానే చిన్నారులు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు.

అందరూ కలిసి ఆడాలని చూస్తారు కానీ ఈ మహమ్మారి నేపథ్యంలో ఆ అవకాశం లేకుండా ఎవరి బాక్సులలో వారే కూర్చొని బొమ్మలతో ఆడుకొనే విధంగా యాజమాన్యం,ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు.ఏది ఎలా ఉన్నా ఈ మహమ్మారి నేపథ్యంలో చిన్నారులకు స్కూల్స్ నిర్వహించడం చాలా గొప్ప విషయంగా చెప్పాలి.

థాయ్ ల్యాండ్ ప్రభుత్వం అక్కడ స్కూల్స్ ఈ విషయంలో విజయం సాధించాయి అని చెప్పాలి.

ఎందుకంటే జులై లో స్కూల్స్ ప్రారంభమైనా ఇప్పటివరకు కూడా అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం తో స్కూల్ యాజమాన్యం.

ఉపాధ్యాయుల కృషి ఎంతగా ఉందొ అర్ధం అవుతుంది.మరి మన దేశంలో కూడా స్కూల్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్న విషయం తెలిసిందే.

మరి భౌతిక దూరం,మాస్క్,శానిటైజేషన్ వంటి చర్యలు ఏమాత్రం పిల్లలపై పని చేస్తాయో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube