ఏకంగా పార్లమెంటు లోనే అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిన ఎంపీ...!

ఓ బాధ్యతగల పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ భవనాన్ని అపవిత్రం చేశారు.ప్రజల కోసం చట్టాలు చేసే పార్లమెంట్ భవనంలో అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

 Thailand Mp Caught Watching Porn On Phone In Parliament, Parliament, Thailand Mp-TeluguStop.com

నిండు సభలో ఒక వైపు దేశం బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుంది.అయితే ఆ సమావేశం తనకేమి పట్టనట్టు తన ఫోన్ లో అశ్లీల వీడియోలు ఓపెన్ చేసి అవి చూస్తూ బిజీ అయిపోయాడు.

అయితే అదే సమయంలో అక్కడే గ్యాలరీ లో ఉన్న మీడియా ప్రతినిధులు ఆ సమయంలో సదరు పార్లమెంట్ సభ్యుడు ఫోన్ చూస్తున్న సమయంలో ఫోటోలు క్లిక్ మనిపించినడంతో ఈ వ్యవహారం కాస్త బయటపడింది.ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

ఈ సంఘటన మొత్తం థాయిలాండ్ దేశంలో జరిగింది.

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలోని పార్లమెంట్ లో జరిగిన సమావేశాల మధ్యలో ఈ భాగవతం జరిగింది.థాయిలాండ్ లోని చోన్ బూరి అనే ప్రాంతానికి కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ రొన్నాతేప్ అనువత్ పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఆయన అవన్నీ పట్టించుకోకుండా పూర్తిగా పదినిమిషాల పాటు సెల్ ఫోన్ లో నీలి చిత్రాలు చూస్తూ ఉండిపోయారు.

ముఖానికి ఉన్న మాస్కును కూడా తొలగించి చూడడంలో లీనమై పోయారు.ఈ విషయాన్ని గమనించిన థాయిలాండ్ పార్లమెంట్ లోని గ్యాలరీ లో ఉన్న మీడియా బృందం వారు ఆ సమయంలో ఎంపీ చేస్తున్న వ్యవహారాన్ని మొత్తం ఫోటోలలో క్లియర్ గా కనబడింది.

ఇందుకు సంబంధించి వారి దేశంలో ఆ విషయం హాట్ టాపిక్ గా మారడంతో ఆ పార్లమెంట్ సభ్యుడు మాత్రం తనకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తున్నాడు.తాను ఎలాంటి అశ్లీల వీడియోలు చూడలేదని తాను చూసిన ఆ ఫోటోలోని మహిళా ఆర్థిక సహాయం కావాలని తనకు మెసేజ్ చేసింది అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో సదరు మహిళ తాను ఎలాంటి కష్టాల్లో ఉన్నానన్న విషయం తెలుసుకునేందుకు ఆమె పంపించిన సదరు ఫోటోలను ఓపెన్ చేసి చూశానని.అంతే తప్పించి తాను ఎలాంటి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ఈ విషయం సంబంధించి ఆ దేశ ప్రభుత్వం ఆయనను వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube