దొంగతనం కొత్త కావచ్చు పాపం.. దొంగతనం చేస్తూ కమెడియన్ అలీలా వీడు బుక్ అయ్యాడు

ఒక సినిమాలో అలీ చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు.ఒక హోటల్‌కు వెళ్లి రెండు రూపాయల టీ తాగి, వంద రూపాయల నోటు ఇస్తాడు.

ఆ సమయంలో ఓనర్‌ చిల్లర ఇచ్చేందుకు చూస్తున్న సమయంలో డెస్ట్‌లో ఉన్న డబ్బులన్ని తీసుకుని పారిపోతాడు.కొంద దూరం పారిపోయిన తర్వాత వెనుక ఎవరు రాకపోవడంతో ఆగి తాను దొంగిలించిన డబ్బును చూసుకుంటాడు.

అప్పుడు అతడు తీసుకు వచ్చినవి అతడు అక్కడ ఇచ్చిన వంద రూపాయల కంటే తక్కువ ఉంటాయి.దాంతో కంగు తింటాడు.

దొంగతనం కొత్త అవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.

థాయిలాండ్‌లో అచ్చు ఇలాంటి సంఘటన జరిగింది.ఒక కుర్రాడు బంగారు నగల షాప్‌కు వెళ్లాడు.అక్కడ మెడలో వేసుకునేందుకు చైన్స్‌ కావాలని అన్నాడు.

షాప్‌లో వ్యక్తి గోల్డ్‌ చైన్‌లు చూపిస్తున్న సమయంలో చాలా హుందాగా కొనేవాడి లాగే చాలా చూశాడు.రెండు మూడు చైన్‌లు చూసి, ఒకదానిన మెడలో వేసుకున్నాడు.

ఆ చైన్‌ను చూసుకుంటూ కాస్త అటు ఇటు అడుగులు వేశాడు.అక్కడ నుండి వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించాడు.

మెడలో చైన్‌తో పారిపోయేందుకు ప్రయత్నించాడు.అయితే ఆ షాప్‌ డోర్‌ లు స్మార్‌ సిస్టం.

లోపలి వ్యక్తి బయటకు వెళ్లాలి అంటే అత సులభం కాదు.షాప్‌ వారు మీట నొక్కితేనే ఆ డోర్‌లు ఓపెన్‌ అవుతాయి.

ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తి డోర్‌ తీసేందుకు ప్రయత్నించగా అవి రాలేదు.దాంతో షాక్‌ అయిన ఆ దొంగ వెనక్కు తిరిగి వచ్చి మెడలో ఉన్న చైన్‌ను ఇచ్చేశాడు.దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసుల వచ్చి అతడిని అరెస్ట్‌ చేయడం జరిగింది.ఈ సంఘటన మొత్తం గోల్డ్‌ షాప్‌లోని సీసీ టీవీ లో రికార్డు అయ్యింది.

దాంతో అంతా కూడా ఆ వీడియో వైరల్‌ అయ్యింది.పెద్ద ఎత్తున ఈ వీడియో గురించి ఫన్నీ కామెంట్స్‌ వస్తున్నాయి.

ఈ దొంగ గురించి కొంత మంది జాలి చూపుతుంటే మరి కొందరు మాత్రం సీరియస్‌ అవుతున్నారు.చిల్లర దొంగకు ఎంత పెద్ద కష్టం అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.ఈ దొంగ విన్యాసంను మీరు ఒక సారి కింది వీడియోలో చూసి నవ్వేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube