నీటిలో జారిపడ్డ యజమాని రాకకోసం కుక్క ఎదురు చూపులు, కన్నీరు పెట్టిస్తున్న సంఘటన

నీటిలో జారిపడ్డ యజమాని రాకకోసం కుక్క ఎదురు చూపులు, కన్నీరు పెట్టిస్తున్న సంఘటన

కుక్కలకు ఉన్న విశ్వాసం మనుషులకు ఉండదని అంటూ ఉంటారు.ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు అని గతంలో చాలా సార్లు నిరూపితం అయ్యింది.

 Thailand Farmer Owner Who Drowned In Pond Loyal Dog Waits For Him-TeluguStop.com

మనం కూడా తన యజమాని పట్ల కుక్కలు చూపించిన విశ్వాసంను కథనాలుగా చదువుకున్నాం, చెప్పుకున్నాం.ఇప్పుడు మరో కుక్క విశ్వాసంకు సంబంధించిన విశ్వాసంతో మీ ముందుకు వచ్చాం.

ఇలాంటి కుక్కలు కూడా ఉంటాయా అన్నట్లుగా కొన్ని కుక్కలు ఉంటాయి.మనుషులతో కుక్కలు ఇంతగా మింగిల్‌ అవుతాయా అంటూ అనిపించేలా ఈ కథనం ఉంటుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… థాయిలాండ్‌లో గత వారం ఈ సంఘటన జరిగింది.స్థానికులను కన్నీరు పెట్టించిన ఈ ఉదంతం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తన యజమాని కోసం కుక్క పడిగాపులు కాసిన తీరు వీడియోల్లో తెగ వైరల్‌ అయ్యింది.థాయిలాండ్‌కు చెందిన సోంపార్న్‌ సితోంగ్‌కుమ్‌ అనే 56 ఏళ్ల వ్యక్తి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

వ్యవసాయ ఆధారిత కుటుంబం అయిన సోంపార్న్‌కు పిల్లలు ఉన్నారు.పొలానికి నీళ్లు పెట్టే పని పిల్లలు చూసుకుంటారు.

ఇటీవల ఒక రోజు ఇంట్లో పిల్లలు ఎవరు లేకపోవడంతో పొలానికి వాల్‌ తిప్పే పని సోంపార్న్‌కు వచ్చింది.రాత్రి సమయంలో ఆయన వెళ్లి వాల్‌ తిప్పాల్సి ఉంది.ఎప్పుడు చేసే పనే అనే కావడంతో ఇంట్లో వాళ్లు కూడా పర్వాలేదు వెళ్లు అనుకున్నారు.ఆయన తన పెంపుడు కుక్కను వెంట పెట్టుకుని టార్చ్‌తో అక్కడకు వెళ్లాడు.

బాయి అంచులో వాల్‌ ఉంటుంది.టార్చ్‌ను ఒడ్డున పెట్టి చెప్పులు కూడా వదిలేసి వాల్‌ తిప్పేందుకు వెళ్లాడు.

ఆ సమయంలో కాస్త కళ్లు తిరిగాయేమో ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు.

సోంపార్న్‌ పెంపుడు కుక్క అతడి కోసం ఎదురు చూస్తుంది.ఇంకా వస్తాడేమో వస్తాడేమో అంటూ తెల్లవారే వరకు ఎదురు చూసింది.చెప్పులు, టార్చ్‌ వద్దే కుక్క ఎదురు చూడటం గమనించిన సోంపార్న్‌ చెల్లెలు ఆందోళన చెందింది.

వెంటనే రిస్క్యూ టీం కు సమాచారం అందించింది.వారు వచ్చి దాదాపు గంట పాటు వెదికి అతడి డెడ్‌ బాడీని బయటకు తీశారు.

కుక్క మాత్రం ఆ బాయి వద్దే ఎదురు చూస్తూ ఉంది.యజమాని కోసం అది చాలా ఆతృతగా ఎదురు చూడటం చూసి స్థానికులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube