థాయ్ ఆపరేషన్ లో ఇద్దరు భారతీయులు

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహల్లో చిక్కుకున్న 12 మంది బాలుర విషయం అందరికి తెలిసిందే అయితే ఈ రెస్క్యు ఆపరేషన్ ఎంతో సక్సెస్ ఫుల్ గా చేసుకుని ఆ 12 మంది ని కోచ్ ని కాపాడిన ఘటనతో ధాయ్ ప్రభుత్వం పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.రెస్క్యు ఆపరేషన్ సామాన్యమైనది కాదు ఎంతో టెక్నాలజీ ని ఉపయోగించి మరీ ఈ ఆపరేషన్ కంప్లీట్ చేశారు.ఈ రెస్క్యు చేసిన వారిని ప్రపంచ వ్యాప్తంగా హీరోలు గా బిరుదులూ కూడా ఇచ్చేస్తున్నారు అయితే

 Thailand Cave Rescue 2 Indian Engineers Helped Save Thai Boys-TeluguStop.com

ఈ హీరోలలో ఈ రెస్క్యు ఆపరేషన్ లో పాల్గొన్న వారిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భారతీయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.భారత్‌కు చెందిన కిర్లోస్కర్ కంపెనీ తరఫున ఇద్దరు ఇంజినీర్లు పాలుపంచుకున్నారు.గుహలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకు రావడానికి కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ సాంకేతిక సాయం అందించింది.

గుహలో నీటిమట్టం తగ్గించడానికి అవసరమైన సామాగ్రి, సాంకేతికత భారతీయ కంపెనీకి ఉన్నాయని ముందుకు వచ్చింది.దాంతో థాయ్ ప్రభుత్వం అంగీకరించడంతో కిర్లోస్కర్ రంగంలోకి దిగింది.భారత్‌తో పాటు థాయ్‌లాండ్, యూకేలోని తమ కార్యాలయాల నుంచి నిపుణులను గుహ వద్దకు పంపించింది…మొత్తం ఏడుగురు నిపుణులలో

ఇద్దరు భారత్ నుంచి వెళ్లారు.

వారు మహారాష్ట్రకు చెందిన ప్రసాద్ కులకర్ణి, శ్యామ్ శుక్లాలు.కిర్లోస్కర్ కంపెనీలో ప్రసాద్ ప్రొడక్షన్ డిజైన్ హెడ్ కాగా, శ్యామ్ కార్పోరేట్ రీసెర్చ్ జనరల్ మేనేజర్.“మేడిన్ ఇండియా” పైపుల ద్వారా గుహలో నీటిని భారీ మొత్తంలో బయటకి పంపటానికి దోహద పడ్డాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube