మోడ్రన్ జాంబలకడిపంబ.. ఆ గ్రామంలో మగవారు ఆడవారిలా ప్రవర్తిస్తారు..అసలు విషయం ఏంటంటే..  

Thai Villagers Fears Evil Widow Ghost Will Kill Their Men-nakhon Phanom Village Life Style,telugu Viral In Social Media,villagers Fears Evil Widow Ghost,viral In Social Media

అప్పట్లో ఈ.వి.వి..

మోడ్రన్ జాంబలకడిపంబ.. ఆ గ్రామంలో మగవారు ఆడవారిలా ప్రవర్తిస్తారు..అసలు విషయం ఏంటంటే..-Thai Villagers Fears Evil Widow Ghost Will Kill Their Men

సత్యనారాయణ గారి దర్శకత్వం లో వచ్చిన జాంబలకడి పంబ సినిమా గుర్తుందా ! అందులో మగవారు ఆడవారిగాను , ఆడవారు మగవారిగాను ప్రవర్తిస్తూ మనల్ని నవ్వించారు. అలాంటి వింతలు నిజ జీవితం లో జరిగితే షాక్ అవ్వకుండా ఉంటామా? అలాంటి వింతే ఒక ఊరిలో జరిగింది . అక్కడ ఉన్న మగవారంత అమ్మాయిల డ్రెస్ లు వేసుకుంటారు.

అమ్మాయిల లాగా వేషధారణ తో కనిపిస్తారు. అసలు విషయం ఏంటంటే.

థాయిలాండ్ లోని నఖోన్ ఫానోమ్ అనే గ్రామానికి వెళ్లి చూస్తే పురుషులందరు ఆడ వేశాల్లో కనిపిస్తారు. అక్కడ మగవారి లాగా ఎవరు కనిపించారు , మగవారు వేసుకునే బట్టలు కూడా అక్కడ ఉండవు .

పైగా అక్కడ ఉండే ఆడవాళ్లే వారి ఇంట్లో మగవారికి వారి బట్టలు వేసుకోమని ప్రోత్సహిస్తారు..

ఆ ఊరిలో ఆడ దెయ్యం

నఖోన్ ఫానోమ్ గ్రామంలో కొన్నాళ్ల క్రితం తరచుగా మగవారు చనిపోతూ వచ్చారు. దానికి కారణం తెలియక అయోమయం లో ఆ గ్రామస్తులు ఆందోళన చెందారు. తరువాత ఆ ఊరిలో ఒక ఆడ దెయ్యం తిరుగుతుంది అని ప్రచారం నడిచింది..

ఆ ఆడ దెయ్యం మగవారు కనిపిస్తే చంపేస్తుందని గ్రామస్థులందరికి పుకార్లు వెళ్లాయి. దానితో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ఆడ దెయ్యం మగవారినే చంపుతుంది కాబట్టి మగవారు ఆ ఆడ దెయ్యం నుండి కాపాడుకోవాలంటే ఆడవారి లాగా వేషం వేసుకుంటే వారిని చూసిన దెయ్యం ఆడవారే అనుకోని వెళ్ళిపోతుందని భావించి ఆ గ్రామం లో ఉన్న మగవారందరు అప్పటి నుండి ఆడవేశం లో తిరుగుతున్నారు.

పైగా అప్పటి నుండి మగవారు చనిపోవడం తక్కువయిపోయిందట.

.