ఈమద్య కాలంలో ఒక అమ్మాయికి పాతిక ఏళ్లు వచ్చినా కూడా బాయ్ ఫ్రెండ్ లేడు అంటే ఆమెలో ఏమైనా లోపం ఉందా అని అంతా అంటూ ఉంటారు.రెండు పదుల వయసు కూడా రాకుండానే పాశ్చాత్య దేశాల్లో అమ్మాయిలు ప్రేమలో పడుతుంటారు.
ఈ విషయంలో మన దేశం కొంత బెటర్ అని మొన్నటి వరకు అనుకున్నాం.కాని ఇప్పుడు మనదేశంలో కూడా రెండు పదులు దాటకుండానే ఎక్కువ శాతం అమ్మాయిలు ప్రేమలో మునిగి తేలుతున్నారు.
అయితే థాయిలాండ్‌కు చెందిన ఒక అమ్మాయి మాత్రం 26 ఏళ్లు వచ్చినా కూడా ప్రేమలో పడలేదు.దాంతో ఆమె తండ్రికి ఆందోళన మొదలైంది.
మరీ ఆలస్యం చేయవద్దని భావించిన అతడు తన కూతురు కోసం వరుడిని వెదికే పనిలో పడ్డాడు.అయితే ఆయన విచిత్రమైన పద్దతిలో వరుడి ఎంపిక మొదలు పెట్టాడు.
థాయిలాండ్‌లో కట్నాలు ఉండవు.అప్పట్లో మన దేశంలో ఉన్న పద్దతి కన్యాశుల్కం పద్దతి ఇప్పటికి అక్కడ కొనసాగుతుంది.అంటే అమ్మాయి తండ్రికి అబ్బాయి కుటుంబ సభ్యులు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.అక్కడి పద్దతికి రివర్స్‌గా రొడాంగ్ అనే వ్యక్తి తన కూతురును పెళ్లి చేసుకుంటే తానే రెండు కోట్లు ఇస్తానంటూ ప్రకటించాడు.
థాయిలాండ్ దేశంలో ప్రముఖ పండ్ల వ్యాపారుల్లో రొడాంగ్ ఒకరు.ఆయన తన కూతురు పెళ్లి చేసేందుకు సిద్దం అయిన సమయంలో ఆమె లవ్ చేయడం లేదని చెప్పింది.
అందుకే తన ప్రయత్నంగా నా కూతురికి సరైన వరుడు దొరికితే 2 కోట్ల డబ్బులు ఇవ్వడంతో పాటు, నా వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటాను అంటూ ప్రకటించాడు.
సోషల్ మీడియాలో ఈ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.ఏ దేశంకు చెందిన వారైనా పర్వాలేదు, నా కూతురును ఆనందంగా చూసుకోవడంతో పాటు, నా వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తాడనే నమ్మకం నాకు కలిగితే నా 26 ఏళ్ల కర్న్ సిటా అనే కూతురును ఇచ్చి పెళ్లి చేస్తానంటూ ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది.ఆయన ప్రకటనకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది స్పందిస్తున్నారు.
రెండు కోట్లు అక్కర్లేదు మీకే మీము తిరిగి ఇస్తాము మీ అందమైన అమ్మాయిని మాకు ఇవ్వండి అంటూ కొందరు కోరుతున్నారు.మొత్తానికి సోషల్ మీడియాలో రొడాంగ్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది.
మరి కర్న్ సిటాకు ఎలాంటి భర్తను తండ్రి ఎంపిక చేస్తాడో చూడాలి.
మొదట ఇలా సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి పెట్టడంపై కర్న్ సిటా ఆగ్రహం వ్యక్తం చేసిందట.
అయితే తండ్రి ఆతృతను చూసిన ఆమెకు సరే అనిపించిందట.