వాంతితో కోటీశ్వరుడైన జాలరి.. ఎలా అంటే?

వాంతి తో కోటేశ్వరుడు అవడం ఏంటి అని అనుకుంటున్నారా.వాంతిని చూస్తేనే ఒక రకమైన ఇబ్బంది ఎదురవుతుంది‌ ఎవరికైనా….

 Thai Fisherman Spots Rock Like Lumps On Beach It Turns Out To Be Whale Vomit, Am-TeluguStop.com

అలాంటివి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు అని అనుకుంటున్నారా.అది మామూలు వాంతి కాదు.

ఏకంగా కోట్లను తీసుకొచ్చిన వాంతి.ఒక జాలరి కి వాంతి తో అదృష్టం తలుపు తట్టింది.

కేవలం ఆ వాంతి వల్ల కోటీశ్వరుడయ్యాడు.

థాయిలాండ్ కు చెందిన 60 ఏళ్ల నరీస్ సువన్న శాంగ్.

ఇతను ఒక జాలరి.నరీస్ ఒకరోజు నాఖోన్ సి దమ్మరాట్ సముద్ర తీరంలో నడుస్తున్న సమయంలో తనకు ఒక రాయి ఎదురయింది.

దానిని చూసిన నరీస్ ఇది చూడటానికి కొంత విభిన్నంగా ఉండటంతో దానిని వెంటనే అక్కడ ఉన్న తన సోదరులను పిలిచి ఆ రాయిని ఇంటికి తీసుకు వెళ్ళమని చెప్పాడు.దీంతో తన సోదరులు ఆ రాయిని పరిశీలించగా అది రాయి కాదని తిమింగలం వాంతి ( వేల్ వోమిట్స్) అని పసిగట్టారు.

దీనిని మరొక్క పేరు “అంబర్గిస్” అని కూడా పిలుస్తారు.

Telugu Ambergis, Fishermanfinds, Fragrance, Whale Vomit-Latest News - Telugu

అయితే ఆ రాయిని పరిశీలించిన ఆ సోదరులు లెటర్ తో వెలిగించగా దాని నుండి సువాసన వెదజల్లుతూ రాగా తిమింగలం వాంతి అని కచ్చితంగా తెలుసుకున్నారు.దీనిని మరింత పరిశీలించడానికి ఒక వ్యక్తిని పిలువగా… అతను కూడా అదే మాట వినిపించారు.పైగా దానిని అతడు కొనడానికి సిద్ధంగా ఉండగా… దానికి ఒక రేటు చెప్పాడు.దాదాపు 3.2 మిలియన్ల డాలర్ల( రూ.23.5 కోట్లు) తో ఆ వ్యక్తి కొనుగోలు చేయగా నరీస్ ఆశ్చర్యానికి అంతు లేకుండాపోయింది.

కాగా ఆ తిమింగలం వాంతి కు అంత రేటు ఉండటానికి కారణం… దాని నుండి వెలువడే సువాసన తో మంచి వాసన ఇచ్చే సెంట్ స్ప్రే లను తయారు చేస్తారు.ఈ సువాసన చాలా సమయం వరకు ఉంటుందని తెలిపారు.

దీంతో ఆ జాలరి కు నిజంగానే అదృష్టం కోట్లల్లో దక్కిందని సోషల్ మీడియాలో కామెంట్ లు అందుతున్నాయి.పైగా ఆ రాయిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube