హైపర్ ఆది ప్రియమణి హాట్ కామెంట్స్.. నెట్టింట్లో వైరల్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈయన తన స్కిట్ లలో పంచులు వర్షం కురిపిస్తూ, జడ్జ్ లను, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.

 Thaggedele Special Event Priyamani Shocking Comments On Hyper Aadi, Hyper Aadi,-TeluguStop.com

అయితే అలాంటి హైపర్ ఆదిని హీరోయిన్ ప్రియమణి ఒక ఆట ఆడేసుకుంది.హాట్ కామెంట్స్ చేస్తూనే ఆది గాలి తీసేసింది.

మధ్యలో రోజా, ఇంద్రజ లపై కూడా కొన్ని సెటైర్స్ వేసింది.అసలేం జరిగిందంటే.

మల్లెమాల వారు ప్రతి ఒక్క పండుగకు ఏదో ఒక ఈవెంట్లు చేస్తారన్న విషయం అందరికి తెలిసిందే.ఇక ఈ సారి దీపావళికి తగ్గేదేలే అంటూ ఒక ఈవెంట్ ను రూపొందించారు.

ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, ఇందులో సీనియర్ హీరోయిన్ లు రోజా, ఇంద్రజ, ప్రియమణి లు సందడి చేశారు.ఈ క్రమంలోనే హైపర్ ఆది డైరెక్టర్ అవతారమెత్తి ఐదుగురు హీరోయిన్ లతో మూవీ ప్లాన్ చేశాడు.

మొదట ఇంద్రజ, రోజా సూపర్ హిట్ సాంగ్ ల తో ఎంట్రీ ఇచ్చారు .అనంతరం ప్రియమణి ఎంటర్ అయ్యింది.ప్రియమణి రాగానే ఆది తనలోని రొమాంటిక్ యాంగిల్ ని బయట పెట్టి వచ్చి రాగానే డైరెక్టర్ కు ఒక హగ్ ఇవ్వాలని తెలియదా నీకు అని ప్రియమణిని అనడంతో వెంటనే ప్రియమణి హైపర్ ఆది పై అదిరిపోయే పంచ్ వేసింది.రోజా, ఇంద్రజ లను చూస్తూ ఆల్రెడీ మా అమ్మ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్ కూడా సెలెక్ట్ చేశారా అని అడిగింది.

దీనితో రోజా, ఇంద్రజ ఒక్కసారిగా షాక్ అయ్యారు.వెంటనే హైపర్ ఆది వారు కూడా హీరోయిన్స్ అనడంతో ముందే చెప్పలేదు కదరా బొకడా అంటూ అందరి ముందు హైపర్ ఆది పరువుతీసింది ప్రియమణి.

ప్రస్తుతం ప్రియమణి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube