తడి కాళ్లతో పడుకుంటే ఎంత అనర్ధం జరుగుతుందో తెలుసా?   Thadi Kaallatho Padukunte Emi Avutundi     2018-01-17   21:57:20  IST  Raghu V

మన జీవితం ఆనందంగా,సంతోషంగా, సిరి సంపదలతో ఉండాలంటే లక్ష్మి దేవి కటాక్షం తప్పనిసరిగా ఉండాలి. ఆలా లక్ష్మి దేవి కటాక్షం పుష్కలంగా ఉండాలంటే కొన్ని పనులను చేయకూడదు. ఆ తల్లి ఆగ్రహానికి గురి కాకుండా ఉంటే అనుగ్రహానికి పాత్రులు అవుతాం. అందుకే లక్ష్మి దేవి అనుగ్రహానికి పాత్రులు అవ్వటానికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో మన శాస్ర్తాల్లో వివరంగా చెప్పారు. వాటిని తెలుసుకొని ఫాలో అవ్వాలి. అప్పుడే మనం లక్ష్మి దేవి కటాక్షానికి పాత్రులు అవుతాం.

కానీ మనం తెలియక చేసిన తప్పుల కారణంగా కూడా ఇబ్బందుల్లో పడతాం. ఆలా అని ప్రతి దానికి భయపడవలసిన అవసరం లేదు. మన పెద్దలు చెప్పిన ఆచారాలను పాటించటంలో తప్పు లేదు. ఆ ఆచారాలను పాటించటం వలన మంచి జరుగుతుంది. కానీ చెడు మాత్రం జరగదు. ఇప్పుడు లక్ష్మి దేవి కటాక్షం కలగాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.

చీపురును కాలితో తొక్కకూడదు. అలాగే చీపురును దాటకూడదు.

ఇంటి ఆవరణలో ఉన్న బావులను పూడ్చకూడదు.

తలకు నూనెను ఇంటిలోని వారికి మాత్రమే రాయాలి. బయట వారికి రాయకూడదు.

మహా విష్ణువు లేదా శివుణ్ణి పూజించాలి.

తులసి చెట్టును పూజించాలి.

తడి కాళ్లతో పడుకుంటే లక్ష్మి దేవి అనుగ్రహం ఉండదు.

కాబట్టి వీటిని పాటించి లక్ష్మి దేవి కటాక్షం పొంది ఆనందంగా,సంతోషంగా, సిరి సంపదలతో ఉంటారు.