సంచలనం అవుతున్న కవిత చీర ఖరీదు..     2018-02-04   22:22:41  IST  Bhanu C

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంభం ఎప్పుడు వార్తల్లో ఉంటుంది..ఒకవేళ లేకపోయినా సరే కాంగ్రెస్ వాళ్ళు ఎదో ఒకరకంగా కేసీఆర్ ఫ్యామిలీ పై కామెంట్స్ చేస్తారు..ఎప్పుడు ఎదో ఒక అంశంతో కేసీఆర్ ని టార్గెట్ చేసే కాంగ్రెస్ ఈ సారి రూటు మార్చింది..ఎప్పుడు కేసీఆర్ అయితే బాగోదు అనుకుందోమో కేటిఆర్ ని కూడా వదిలేసి ఇపుడు ఎంపీ కవితని టార్గెట్ చేశారు..కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎంపీ సుష్మితా దేవ్ ఎంపీ కవితని టార్గెట్ చేశారు..

తెలంగాణా మహిళా కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన సుష్మితా దేవ్..కేసీఆర్ తెలంగాణా ఆడబిడ్డలను ఒకలా తన కూతురు కవితని ఒకలా చూస్తున్నారు..తెలంగాణ ప్రభుత్వం మహిళలకు 30 రూపాయల చీరలు ఇస్తోందని….కానీ కేసీఆర్ కూతురు కవిత మాత్రం పార్లమెంటుకు లక్షలలో విలువ చేసే చీరలు కట్టుకుంటుందని ఆమె ఆరోపించారు.. పార్లమెంటు సమావేశాలలో కవితను చూస్తుంటాను ఎంపీ కవిత కట్టుకునే చీరల విలువ లక్షల్లో ఉంటుదని తెలిపారు ఆమె..

కేసీఆర్ తన కూతురు కవితను చూసుకుంటున్నట్టుగానే…తెలంగాణా మహిళల సంక్షేమాన్ని చూడాలని కోరారు.. మహిళలందరూ ఒక్కటిగా ఉంటే రాబోయేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు..మేము ఏకంగా ప్రదానిపైనే యుద్ధం చేస్తున్నాం..తెలంగాణలో కేసీఆర్ మాకో లెక్క కాదు అంటూ విమర్శించారు..దేశం లో మాటలు ఎక్కువ పని తక్కువ జరుగుతుందని ఎద్దేవా చేశారు..మీడియాలో న్యూస్ కంటే మోడీ ప్రకటనల భజనే ఎక్కువగా ఉంటోందని ఎద్దేవా చేశారు..