అమెరికాలో తెలుగు వారు అందరూ ఎక్కడా ఉన్నా సరే ఒక చోటున కలుసుకుని వారు ఉంటున్న ప్రాంతాల వారిగా అక్కడి అసోసియేషన్ లతో కలిసి తెలుగు పండుగలని జరుపుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీనే.ముఖ్యంగా తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన పండుగగా పేరొందిన సంక్రాంతి పండుగ అంటే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే రెక్కలు కట్టుకుని మరీ సొంత ఊళ్ళకి వాలిపోతారు.అయితే
సొంత ఊళ్ళకి వెళ్ళడం కుదరిని సమయంలో అమెరికాలో ఈ పండుగని తెలుగు సంఘాలు నిర్వహిస్తాయి.అలాగే ఇప్పుడు తెలుగు కళా సమితి.తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలని నిర్వహిస్తున్నారు.2019 జనవరి 27 న ఉదయం 9.00 నుంచీ సాయంత్రం 5.00 గంటల వరకూ ఈ సంబరాలని న్యూజెర్సీ లోని, శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ,బ్రిడ్జ్ వాటర్ ,ఓల్డ్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారని తెలిపారు.